నేడు కన్వర్జెన్స్ సమావేశం
పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం కన్వర్జెన్స్ సమావేశం నిర్వహిస్తామని జిల్లా మత్య్సశాఖ అధికారి వేముల తిరుపతయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాప్టివ్ సీడ్ నర్సరీస్ ఏర్పాటుపై సమావేశంలో చర్చిస్తామన్నారు. ఇంజినీరింగ్, డ్వామా, ఇరిగేషన్, పంచాయతీ, డీఆర్‌డీఏ, మత్స్యశాఖ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
అదుపులో డయేరియా
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలో డయేరియా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు పేర్కొన్నారు. గ్రా మాన్ని సోమవారం సందర్శించారు. విరేచనాలు, వాంతులతో బాధపడుతున్న 19 మందికి వైద్యసేవలందించడంతో కోలుకున్నట్టు తెలిపారు. గ్రామస్తులందరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశు భ్రత పాటించాలని కోరారు. ఆయన వెంట ప్రొగ్రాం అధికారి డాక్టర్ విజయమోహన్, వైద్యాధికారులు ఐశ్వర్య, కౌశిక్, సిబ్బంది సత్తిబాబు, శంకర్, శ్రీనివాసరావు ఉన్నారు.
ఆపరేటర్ ఖాతాలోకి ఆర్థిక సంఘం నిధులు
కొమరాడ: స్థానిక మండల పరిషత్ కార్యలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఖాతాలోకి 15 ఆర్థిక సంఘం నిధులు జమకావడం చర్చనీయాంశంగా మారింది. 31 పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో వివిధ రకాల పనులు చేపట్టారు. వీటిలో అధిక పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల డబ్బులు సుమారు రూ.15లక్షల నిధులు ఆయన ఖాతాలోకి మళ్లడం అనుమానాలకు తావిస్తోంది. సంబంధిత ఆపరేటర్ డిజిటల్ సంతకాలను (డీఎస్‌కే) తన వద్ద ఉంచుకుని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఎంపీడీఓ మల్లికార్జునరావు వద్ద ప్రస్తావించగా.. పంచాయతీల్లో జరిగే పనులతో తనకు సంబంధం లేదని, పంచాయతీ విస్తరణ అధికారి, పంచాయతీ కార్యదర్శులే చూసుకుంటారని సెలవిచ్చారు.
రాజకీయ కక్ష సాధింపులు ఆపాలి
పార్వతీపురంటౌన్: మధ్యాహ్న భోజన పథక కార్మికులపై కక్షసాధింపులు, వేధింపులు ఆపాలని సీఐటీయూ నాయకుడు ఎం.మన్మథరావు డిమాండ్ చేశారు. పార్వతీపురం కలెక్టరేట్ ఆవరణలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి సోమవారం నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత 22 సంవత్సరాలకు పైగా పాఠశాలల్లో చాలీచాలని జీతంతో, ప్రతినెల బిల్లులు రాకపోయినా అప్పుచేసి పిల్లలకు భోజనం పెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని పలు పాఠశాలల్లో ఎలిమెంటరీ స్కూలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులను తొలగించారన్నారు. వారిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కొత్తవారిని నియమించారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జి. వెంకటరమణ, బి.సూరిబాబు, వి.ఇందిర, శాంతి, తులసి, లక్ష్మి, చిలకమ్మ, పూర్ణిమ పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత జిల్లాయే లక్ష్యం
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురంటౌన్: ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగించబోమని జిల్లాలో ఉన్న అన్ని పురపాలక సంఘాలు, పంచాయతీలు తీర్మానం చేసి అమల్లోకి తేవాలన్నారు. భవిష్యత్‌లో పేపర్, క్లాత్ బ్యాగ్‌లను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో 2.50 లక్షల గృహాలను ఈ నెల 15లోగా సందర్శించి పీ–4 సర్వే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణ, బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామస్థాయిలో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, ఇన్‌చార్జి జేసీ హేమలత, ఎస్‌డీసీ పి.రామచంద్రారెడ్డి, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.
నేడు కన్వర్జెన్స్ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment