ధాన్యం కుప్పలు దగ్ధం
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించడంతో దుద్ది రమణ, చుక్క రాము, సబ్బి మంగమ్మ, చిల్ల ఈసు, తదితరులకు చెందిన ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. వెంటనే గజపతినగరం ఫైర్‌స్టేషన్‌కు గ్రామస్తులు సమాచారం అందించగా వారు వచ్చి మంటలు మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం జరగలేదని గ్రామపెద్ద రామసత్యం చెప్పారు.సంవత్సరం అంతా తినడానికి ఉంచుకున్న తిండి గింజలు కాలి బూడిదయ్యాయని పేద రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సతివాడ వైపు ఏనుగుల పయనం
భామిని: మండలంలో ఏనుగుల బెడద తీవ్రమైంది. ఆదివారం భామిని మండలంలోని సతివాడ సమీపంలో మొక్కజొన్న తోటలను తినివేస్తూ ఏనుగుల గుంపు పయనమైంది. పాత ఘనసర సమీపంలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు తివ్వాకొండల వైపు దారిమళ్లినట్లు ఫారెస్టు అదికారులు చెబుతున్నారు.ప్రస్తుతం మొక్కజొన్న పొత్తులు చేతికి అందే సమయంలో తోటలపై ఏనుగులు దాడి చేసి తినివేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఏనుగులను పూర్తి స్థాయిలో దారి మళ్లించి కాపాడాలని బాధిత రైతులు కోరుతున్నారు.
వైద్యరంగంలో
ఎనస్థీషియాదే ప్రధాన పాత్ర
నెల్లిమర్ల: వైద్య రంగంలో ఎనస్థీసియాదే ప్రధాన పాత్ర అని ఐఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విజయనగరం మిమ్స్ వైద్య కళాశాలలో న్యూరో అనస్థీషియా సీఎంఈ సదస్సును ఆదివారం నిర్వహించారు. నేషనల్ ఐఎస్‌ఏ, విజయనగరం సిటీ బ్రాంచ్ సహకారంతో ఈ సదస్సు నిర్వహించగా సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాల అనస్థీషియా విభాగం ఆచార్యులు కె వేంకటేశ్వరరావు మాట్లాడుతూ మిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించామన్నారు. ఈ సీఎంఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మత్తువైద్యులకు ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయ పడ్డారు. వైద్యరంగంలో ప్రధానంగా అనస్థీషియాకు సంబంధించి నూతన ఆవిష్కరణలను డాక్టర్ రాకేష్, డాక్టర్ మీనాక్షి సుందరం, డాక్టర్ విష్ణు మహేష్ వంటి ప్రముఖులు తెలియజేసినట్లు చెప్పారు.
సాయి శర్వాణీ కాలనీలో చోరీ
బొబ్బిలి: పట్టణంలోని పాత బొబ్బిలి సమీపంలో గల సాయిశర్వాణీ కాలనీలో శనివారం రాత్రి చోరీ జరిగింది. మాజీ కౌన్సిలర్ పిల్లా రామారావు ఇంట్లో నగదు, ఇంటి నిర్మాణ సామగ్రిని దొంగతనం చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న సీసీటీవీకి గోనె సంచి కప్పి ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై ఏఎస్సై బీవీ రమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.మూడు డ్రిల్లింగ్ మెషీన్లు, కొంత నగదు పోయినట్లు అనుకుంటున్నా ఇంటి యజమాని విజయవాడ వెళ్లడం వల్ల పూర్తి వివరాలు తెలియరాలేదు. ఆయన వచ్చిన తరువాత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసే అవకాశముందని ఏఎస్సై తెలిపారు.
జూదరుల అరెస్టు
పార్వతీపురం రూరల్: పట్టణంలోని రెండుచోట్ల పేకాట స్థావరాలపై దాడులు చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని రూ.4,420లు స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్సై గోవింద తెలిపారు. పట్టణంలోని బుగత వీధిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.1020, రామాపురం కాలనీలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.3,400లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం పార్వతీపురం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరచనున్నట్లు తెలిపారు.
ధాన్యం కుప్పలు దగ్ధం
ధాన్యం కుప్పలు దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment