ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
పాలకొండ రూరల్: గ్రామస్థాయిలో పీహెచ్‌సీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాలకొండ మండలంలోని అన్నవరం, ఎం.సింగుపురం పీహెచ్‌సీలను సందర్శించి అక్కడి డ్రగ్‌స్టోర్, ల్యాబ్‌బ్ లతో పాటు రోజువారీ ఓపీ రిజస్టర్లు పరిశీలించారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తాజా స్థితిగతులును తెలుసుకున్నారు. ప్రైవేట్ వైద్య కేంద్రాలను సందర్శించిన ఆయన అక్కడి వసతుల గురించి రోగుల దగ్గర ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించాలని, క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది గ్రామాల్లో సంచరిస్తూ రోజువారీ నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుత సీజన్‌లో విజృంభించే వ్యాధులు, వాటిని అధిగమించేందుకు అవలంబించాల్సిన రోగ నిరోధక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట యోగేశ్వరరెడ్డి, సన్యాసిరావు, డీఎస్‌ఓ శంకరావు, వైద్యాధికారులు తేజరత్న రాజ్, వెన్నెల, రవికుమార్, అనిల్‌కుమార్ తదితరులున్నారు.
డీఎంహెచ్‌ఓ భాస్కరరావు
Comments
Please login to add a commentAdd a comment