8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురంటౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో మహిళా దినోత్సవ వేడుకలపై సంబంధిత అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఆ రోజుకు ఎన్నికల కోడ్ ముగిసే అవకాశం ఉన్నందున వేడుకలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. జిల్లాలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహిళలను గుర్తించి, వారి విజయగాథలతో ఇతర మహిళల్లో స్ఫూర్తినింపాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, గిరిజన సంస్కృతి–సంప్రదాయాలను కాపాడే మహిళలు, ఇతరులకు రోల్ మోడల్‌గా నిలిచిన మహిళలను సన్మానించాలని చెప్పారు. మహిళలకు మెగా చెక్కుల పంపిణీ వంటివి చేపట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎస్పీ సురాన అంకిత్ మహావీర్, డీఆర్‌ఓ కె.హేమలత, జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి డా.టి.కనకదుర్గ, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఎం.వి.కరుణాకర్, ఐపీఓ వి.కె.వర్ధన్, ఎల్డీఎం ఎన్.విజయ్ స్వరూప్, డీఎస్డీఓ కె.సాయి కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
సంగమేశ్వరుడి హుండీల ఆదాయం రూ. 7.65 లక్షలు
వంగర : వంగర మండలం సంగాంలో వెలిసిన సంగమేశ్వరస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.7.65 లక్షలు వచ్చినట్టు ఈవో పొన్నాడ శ్యామలరావు తెలిపారు. ఏడు రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాల్లో స్వామి వారి ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల విక్రయం, విరాళాలు, ప్రసాద విక్రయాలు, హుండీలలో భక్తులు వేసిన కానుకల రూపంలో పై మొత్తం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ బోను ఆనందరావు, బొడ్రోతు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment