నేలమీద నే రాయాలా..!
రామభద్రపురం:
పదో తరగతిలో అత్యధిక ఉత్తీర్ణత శాతం కోసం విద్యాశాఖ 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. అందుకనుగుణంగా ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేశారు. విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదువుతున్నారు. అయితే మా పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి. అందరూ ఉత్తమ మార్కులు పొందాలనే ఆలోచనే తప్ప..విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా? అని కనీస అలోచన చేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. పరీక్షకేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అంతులేని నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావాప్తంగా 119 పరీక్ష కేంద్రాల్లో 447 ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలకు చెందిన 22,939 మంది, గతంలో ఫెయిలైన విద్యార్థులు 835 మంది మొత్తం 23,774 మంది పరీక్షలు రాయనున్నారు.
పదోతరగతే కీలకం
పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఎంతో కీలకం. పదో తరగతిలో సాధించిన మార్కులే ఉన్నత విద్య, ఉద్యోగాల కోణంలో ప్రతి దశలోనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ఉత్తమ మార్కులు సాధించాలంటే పరీక్షల కోసం బాగా చదవాలి. అలాగే చదివింది బాగా రాయాలంటే పరీక్ష రాసే గదిలో ప్రశాంత వాతావరణం ఉండాలి. ఈ నెల 17 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఈ పరీక్షలను విద్యార్థులు కూర్చుని రాసేందుకు బల్లలు, తాగునీరు, ఆ గదిలో ఫ్యాన్ వంటి కనీస మౌలిక సదుపాయాలు అవసరం. విద్యార్థి పరీక్ష రాసేటప్పుడు ఎంత బాగా సదుపాయం ఉంటే అంత బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించగలడు. విద్యాలయాలు వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నా..అత్యధిక మార్కులు రావాలన్నా ఆయా పరీక్ష కేంద్రాల్లో వారు పరీక్ష రాసేందుకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. పలు పరీక్ష కేంద్రాలలో కనీస సదుపాయాలు లేవు. అందుకు నిదర్శనం రామభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే పరీక్ష కేంద్రం. ఇక్కడ సుమారు పది తరగతి గదులలో 250 మంది వరకు పరీక్షలు రాయనున్నారు. ఈ కేంద్రంలో విద్యార్థులు కూర్చుని పరీక్ష రాసేందుకు దాదాపు 120 బల్లలు అవసరం. పరీక్షలు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేవు. ఇప్పటివరకు ఒక్క గదిలో కూడా ఒక్క బెంచీ సమకూర్చిన పాపాన పోలేదు. ఒక్కగదిలో కూడా ఫ్యాన్ తిరగడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.అలాగే ప్రశ్నపత్రాలు నేడో రేపో పోలీస్ స్టేషన్లకు రానున్నాయి. ఆ ప్రశ్న పత్రాలు భద్రపరిచేందుకు ట్రంకుపెట్టెలు అవసరం. వాటిని ఇప్పటివరకు సమకూర్చనట్లు తెలిసింది.
తనిఖీలు తప్ప చర్యలు శూన్యం
సమస్యల్లో పదోతరగతి పరీక్షా కేంద్రాలు
కూర్చుని రాసేందుకు బల్లలు,
తాగేందుకు నీరులేని పరిస్థితి
గదులలో ఫ్యాన్‌లు, బాయ్స్‌కు
బాత్‌రూమ్ సదుపాయం కరువు
జిల్లావ్యాప్తంగా 119 పరీక్ష కేంద్రాలు
హాజరుకానున్న విద్యార్థులు 23,774 మంది
సమీపిస్తున్న పరీక్షలు
విస్తుపోతున్న విద్యార్థులు
హెచ్‌ఎం వసతులు సమకూర్చుతామన్నారు
త్రిమెన్ కమిటీ పాఠశాలను సందర్శించి పరీక్షకేంద్రాల మౌలిక సదుపాయాలపై ఆరా తీసింది. అప్పట్లో పరీక్షల సమయానికి తాము సమకూర్చుతామని పాఠశాల హెచ్‌ఎం కామేశ్వరరావు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు.సమకూర్చాల్సిన బాధ్యత ఆయనదే.
ఎ.తిరుమలప్రసాద్,
ఎంఈవో, రామభద్రపురం
చాలా రోజుల క్రితం త్రిమెన్ కమిటీ వచ్చి పరీక్ష కేంద్రాలను పరిశీలించి వెళ్లింది. అలాగే ఇటీవల పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తనిఖీచేసి వెళ్లారు. అయితే తనిఖీలు తప్ప తక్షణ చర్యలు లేవు. పరీక్షలు నిర్వహించే బాధ్యత ఎంఈవోలదేనని, వారే మౌలిక వసతులు సమకూర్చుతారని పాఠశాల యాజమాన్యం చూస్తోంది. అలాగే వేరే పాఠశాలల నుంచి 120 బల్లలు తేవడానికి, తిరిగి పంపించడానికి సుమారు రూ.25 వేల వరకు రవాణా ఖర్చులు అవుతున్నాయని, ఆ నిధులు ఎవరిస్తారని భావిస్తున్నట్లు తెలిసింది. పాఠశాల యాజమాన్యమే వసతులు సమకూర్చుతుంది. మాకేటి సంబంధం అన్న భావనలో ఎంఈవోలు ఉన్నట్లు సమాచారం. అయితే పరీక్షలు సమీస్తున్నాయి.ఇప్పటికీ వసతులు సమకూర్చలేదు.ఏమవుతుందో వేచి చూడాలి మరి.
నేలమీద నే రాయాలా..!
నేలమీద నే రాయాలా..!
నేలమీద నే రాయాలా..!
Comments
Please login to add a commentAdd a comment