శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో తలపడుతున్న ఉషారాణి
విజయలక్ష్ములు..
ఆడపిల్లంటే.. ఆటబొమ్మ కాదు.. ‘ఆటా’డించే అమ్మ. ఎంత ‘బరువైన’ బాధ్యతలనైనా ఇట్టే ఎత్తి పడేస్తారు. అచ్చంగా ఈ విజయలక్ష్ముల్లా. పాలకొండలోని పెద్దకాపు వీదికి చెందిన గార తిరుపతిరావు, చిన్నమ్మడులది వ్యవసాయ కుటుంబం. తిరుపతిరావు ఎద్దుల బండి నడిపేవారు. ఆయనకు మొదటి నుంచి సంగిడీలు ఎత్తడమంటే ఆసక్తి. అప్పుడప్పుడు పోటీలకు కూడా వెళ్లేవాడు. అందువల్లేనేమో.. పిల్లలకు కూడా క్రమంగా ఇష్టం ఏర్పడింది. వెయిట్ లిఫ్టింగ్ వైపు మళ్లేలా చేసింది. తన కుమార్తెలు అరుణరాణి, లలితరాణి, ఉషారాణిలకు చిన్నప్పటి నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రోత్సహించారు. చిన్నతనంలో ఆడపిల్లలు బరువులు ఎత్తడం ఏమిటని మాట్లాడుకునేవారే.. ఇప్పుడు వారి సంకలాన్ని చూసి అభినందిస్తున్నారు. ఎన్నో ‘ఆట’ంకాలను అధిగమిస్తూ.. నేడు వెయిట్‌లిఫ్టింగ్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. వివిధ వేదికల్లో రజిత, బంగారు పతకాలు సాధించారు. పెద్ద కుమార్తె క్రీడా కోటాలో రైల్వేలో ఉద్యోగం సాధించింది. రెండో కుమార్తె ఉషారాణి 2005లో క్రీడల్లోకి అడుగు పెట్టారు. ఆటలో రాణించడం.. ఆమె జీవితాన్నే మార్చింది. పస్తుతం పీఈటీగా సరుబుజ్జిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. తనలాంటి ఎంతోమంది క్రీడా మెరికల ను తయారు చేస్తున్నారు. ఇద్దరు అక్కల అడుగుజాడల్లోనే చిన్న అమ్మాయి కూడా నడుస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణిస్తూ.. ఎన్నో పతకాలను
కై వసం చేసుకున్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు.. ఏకంగా జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడమంటే చిన్న విషయం కాదు. ఈ క్రమంలో వారి కెదురైన ఎన్నో సవాళ్లను దీటుగా ఆటాడేసుకున్నారు. విజయులై సగర్వంగా నిలబడ్డారు. జాతీయ పతాకాన్ని, పాలకొండ కీర్తిని నలుదిశలా రెపరెపలాడిస్తున్నారు.
ఆడపిల్ల అంటే.. ‘ఆడే’ ఉండిపోవాలా..? ఫలానా పనికే పరిమితం కావాలా..? కట్టుబాట్ల బందిఖానాలో బందీ అయిపోవాలా..? ఎవరన్నారు.. సృష్టికి మూలం, అవనిలో సగం.. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. ఇలా ‘ఆమె’ కోసం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ రంగం.. ఈ రంగమన్న తేడా లేదు. పురుషులు చేసే ప్రతి పనినీ సమర్థంగా చేయగలిగే స్థాయికి చేరుకుంది నేటి ఆధునిక మహిళ. ‘సమానత్వమన్న’ పదానికి అర్థం చెబుతోంది. తన శక్తి అపరిమితం.. తన సహనం, తెగువ అనితర సాధ్యం. మధ్యమధ్యలో ఎక్కడో రాబందులు.. తన ఉనికికి అడ్డొస్తున్నా,
తన భవితను చిదిమేస్తున్నా.. వెరవక, వెనకడుగు వేయక.. ధైర్యంగా ముందడుగు వేస్తోంది.. నేటి మన ధైర్య లక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది వనితల
విజయగాథలు, మనో ధైర్యానికి ‘సాక్షి’ అక్షరరూపం. – సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్/పాలకొండ రూరల్
మూడేళ్ల కిందటి వరకు అందరిలానే తానూ ఒక సాధారణ గృహిణి. ఇంటి పని, వంట పని, పిల్లలను చదివించుకోవడం..ఇదే తనకు తెలిసిన వ్యాపకం. భర్త మరణం..ఒక్కసారిగా జీవితాన్ని తలకిందులు చేసింది. ముగ్గురు ఆడపిల్లలు. పెంచడం, పెళ్లిళ్లు చేయడం పెద్ద సవాలు. పెద్దగా చదువు లేకున్నా ఆ బాధ్యతను ధైర్యంగా స్వీకరించింది నాగవంశం లక్ష్మి. పార్వతీపురంలోని జగన్నాథపురానికి చెందిన ఈమె..మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురా లు. పొరుగుసేవల ప్రాతిపదికన పనిచేస్తోంది. మూడేళ్ల కిందట అనారోగ్యంతో భర్త చనిపోయాడు. అప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికురాలి గా మున్సిపాలిటీలో పనిచేస్తోంది. ఈ కాలంలోనే ఎన్నో కష్టాలను దిగమింగుతూ, ముగ్గురు పిల్లలకూ పెళ్లిళ్లు చేసింది. నేటి సమాజం అంతే.. ఒంటరి మహిళంటే చిన్నచూపు. అలాంటి అవమానాలు ఎదుర్కొంటూనే బతుకుపై ఆశతో... పిల్లలు, మనవళ్లపై మమకారంతో అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగిపోతున్నట్టు జీవన గాథను వినిపించారు.
వైద్యులు దైవంతో సమానం. ఎన్నో ప్రాణాలను నిలుపుతారు. అందుకే.. సమాజంలో ఈ వృత్తి అంటే ఎనలేని గౌరవం. అలాగనీ.. ఇందులో సవాళ్లు లేకపోలేదు. ఒక్కోసారి ఎక్కడ చిన్న తేడా జరిగినా.. రోగుల బంధువుల ఆగ్రహానికి గురికాక తప్పదు. మన చేతిలో చిన్న పొరపాటు జరిగినా, అది జీవితాంతం వెంటాడుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ వృత్తిలోని సవాళ్లను అధిగమిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు పాలకొండ ఏరియా ఆసుపత్రి సీ్త్ర వైద్యనిపుణురాలు వై.శివనాగజ్యోతి. సుదీర్ఘ వైద్యవృత్తిలో ఎన్నో పురుళ్లు పోశారు. ఆమె చేతులమీదుగా ఎంతోమందికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. మొదటిగా ఈ లోకాన్ని చూపారు. గతంతో పోల్చుకుంటే నేడు వైద్యవృత్తి సవాల్‌గా మారింది. ఒక సమయమంటూ ఉండదు. 24 గంటలూ నిద్రాహారాలకు దూరమవ్వాలి. పురుషాధిక్య సమాజంలో మగవారితో పోల్చుకుంటే.. ఆడవారికి వైద్యవృత్తి కష్టమైనదే. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు ఈ చదువుల తల్లి. ‘మహిళలు సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. సుస్థిర గుర్తింపును సాధించేలా అడుగులు వేయాలి. సమాజ మనుగడలో కీలక భూమిక పోషించాలి’ అని ఆమె చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన మహిళతో కుటుంబ ఆరోగ్యం కూడా ముడిపడి ఉంటుందని.. ఇటీవల కాలంలో వైద్యవృత్తిపై విద్యార్థినులు ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు.
ఆడపిల్లలు పైలెట్ అవ్వడం చూశాం.. లోకో పైలెట్ అవ్వడమూ చూశాం.. మరి.. ఆటో నడపాలంటే..చిన్నతనమేమీ కాదంటున్నారు పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లికి చెందిన ఎం.సుకన్య. పదో తరగతి వరకు చదువుకున్న సుకన్య..26 ఏళ్ల వయస్సులోనే భారమైన బాధ్యతలు మోస్తోంది. కుటుంబ అవసరాల కోసం తొలుత ఏదో ఒక షాపులో పనికి కుదరాలనుకుంది. ఒకరి మీద ఆధారపడకుండా, నేటి సమాజంలో పురుషులకు దీటుగా నిలబడాలన్న ఆలోచన ఆమెను కొత్తగా ఆలోచించేలా చేసింది. ఆటో చోదకురాలిగా మారితే..ఇలా వచ్చిన ఆలోచనను తన భర్తతో పంచుకుంది. కష్టమైన రంగం..ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నలువైపులా సున్నితమైన హెచ్చరిక. అవేవీ తన లక్ష్యం ముందు నిలవలేకపోయాయి. తన భర్త సహకారంతో రెండు రోజుల్లో ఆటో నడపడం ఆరంభించింది. ఇప్పుడు రెండేళ్లుగా తన జీవన ప్రయాణం ఆటోతోనే. నేడు మహిళా ప్రయాణికులు ఆమెను చూసి గర్విస్తున్నారు.. సెహభాష్ అంటూ భుజం తడుతున్నారు. మగవారైతే..చెల్లెమ్మా, ధైర్యంగా ముందుకెళ్లు అంటూ అండగా నిలుస్తున్నారు. తన కోరిక సొంత ఇల్లు కట్టుకోవాలని..కష్టపడుతోంది..కష్టపడుతూనే ఉంది. ఇంత కష్టాన్నీ భరిస్తున్న ఆమెకు చిన్న వెలితి..రూ.3.35 లక్షలు పెట్టి ఆటో కొనుగోలు చేసింది. నెలకు రూ.10 వేల వరకూ ఈఎంఐకే పోతోంది. నెలయ్యేసరికి కష్టమే కనిపిస్తోంది. ఆటో కోసం చేయూత అందించాలని అధికారుల చుట్టూ తిరిగింది. ఏ ఒక్కరూ దయతలచలేదు. సబ్సిడీ రుణమిప్పిస్తే ఆటో కోసం చేసిన అప్పు తీర్చుకుంటానని ఆమె కోరుతోంది.
తండ్రి కూలీ. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబ నేపథ్యం. ఆ ఇంటి నుంచి ఒక ఆడపిల్ల సవాళ్లను అధిగమించి, ఉన్నత చదువులు చదవడమే కాదు..నేడు సమాజానికి మార్గదర్శిగా ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తున్నారు పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై బెల్లాన సంతోషికుమారి. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన సంతోషికుమారిది నిరుపేద కుటుంబం. తండ్రి లేబర్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. కుమార్తె ఒక్కరే కావడంతో.. కష్టమైనా, తన ఇష్టం మేరకు ఉన్నంతలో మంచి చదువులు చదివించారు. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ, ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుంటూ బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఎన్నో అవాంతరాలు.. ఆటుపోట్లు. ఆడపిల్లకు అంత పెద్ద చదువులెందుకని కొందరు..శిక్షణ నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే..అంతదూరం ఎందుకని ఇంకొందరు భయపెట్టారు. నచ్చజెప్పారు. కుటుంబ ప్రోత్సాహంతో వాటన్నింటినీ ఆమె అధిగమించారు. పోటీ పరీక్షలు రాసి, 2016లో ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం 2018లో విధుల్లో చేరారు. ప్రస్తుతం పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వరిస్తున్నారు. పోలీసు విధులంటే..24 గంటలూ రిస్క్‌తో కూడుకున్న పని. పెళ్లయిన తర్వాత కూడా భర్త (సంతోష్ హరి శివప్రసాద్), అత్తామామల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. దీంతో ఆమె ధైర్యంగా తన పని తాను చేసుకోగలుగుతున్నారు. ఆడపిల్లలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యం కోసం పరిశ్రమించాలని.. సవాళ్లను అధిగమిస్తూ విజయానికి బాటలు వేసుకోవాలని ఆమె స్ఫూర్తి మంత్రం వినిపిస్తున్నారు.
అబ్బురపరిచిన వర్ణచిత్రం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీ్త్రమూర్తి వివిధ వృత్తులలో రాణిస్తున్నట్లు గరుగుబిల్లి మండలంలోని నాగూరు గ్రామానికి
చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి పాలెల సోమేష్ వేసిన వర్ణచిత్రం పలువురిని
ఆకట్టుకుంది.
– గరుగుబిల్లి
సంతాన లక్ష్మి..
మనోధైర్యే లక్ష్మి
సాహసే లక్ష్మి..
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment