
రాజీతోనే కేసుల పరిష్కారం
పార్వతీపురం టౌన్: రాజీతోనే ఎక్కువ శాతం కేసులు పరిష్కారం అవుతాయని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. స్థానిక జిల్లా కోర్టుల సముదాయంలో శనివారం ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్‌తో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు పరిష్కారానికి ఇరువర్గాల సభ్యుల రాజీ ఎంతో అవసరమని తెలిపారు. వివాదాలు ఒకసారి ప్రారంభం అయితే జీవితాంతం కొనసాగుతాయని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేశారు. సంవత్సరాల తరబడి కేసుల వెంట వెళ్లేకన్నా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో వున్న కేసుల సంఖ్యను తగ్గించుకోవడానికి, వ్యాజ్యాలకు ముందు దశలోనే వివాదాలను పరిష్కరించడానికి న్యాయస్థానాలు లోక్ అదాలత్‌ను తీసుకువచ్చాయన్నారు. కార్యక్రమంలో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సౌమ్య జోిస్పిన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్‌ఎస్ రావు, అదనపు పీపీ చంద్రకుమార్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment