నేడు పీజీఆర్‌ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్టు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై గిరిజనులు వినతులు సమర్పించవచ్చన్నారు.
దరఖాస్తుల
ఆహ్వానం
పార్వతీపురం టౌన్: సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్‌ను పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 15 మండలాల నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మున్సిపల్ పాఠశాలలో పని చేస్తున్న అర్హత గల స్కూల్ అసిస్టెంట్‌ల నుంచి ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 12 సాయంత్రం 5 గంటలలోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పై పోస్టులకు సంబంధించిన దరఖాస్తు, అర్హత వివరాలు హెచ్‌టీటీపీఎస్:// పార్వతీపురం మన్యం.ఈఏఎఫ్‌ఎఐసీఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైటు నందు పొందుపరిచినట్టు తెలిపారు.
పక్కాగా సర్వేలు
విజయనగరం: పన్ను వసూళ్లతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన పీ–4 సర్వే, వర్క్ ఫ్రమ్ హోం సర్వేలను పక్కాగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు సహాయ కమిషనర్ కె.అప్పలరాజు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న సర్వేలు, పన్ను వసూళ్ల ప్రక్రియలను ఆదివారం వ్యక్తిగతంగా పరిశీలించారు.
నేడు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్
విజయనగరం క్రైమ్ : జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ ఎత్తేయడంతో తమ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు. ఇకపై ప్రతీ సోమ వారం ఈ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. వినతులు స్వీకరిస్తామని తెలిపారు.
డైట్ చార్జీలు విడుదల
పూసపాటిరేగ: బీసీ సంక్షేమ వసతిగృహాలకు డైట్ చార్జీలు రిలీజ్ చేస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి పెంటోజీరావు ఆదివా రం తెలిపా రు. వసతిగృహాలకు డైట్ చార్జీలు చెల్లించకపోవడంపై సాక్షి దినపత్రికలో ఈ నెల 8వ తేదీన నిర్లక్ష్యపు నీడ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయనగరం జిల్లాకు రూ.2.31కోట్లు మూడో క్వార్టర్ బడ్జెట్‌లో భాగంగా మంజూరు చేశారని జిల్లా బీసీ సంక్షేమాధికారి తెలిపారు.
నేటి నుంచి పైడితల్లి,
కనకదుర్గ అమ్మవార్ల జాతర
భోగాపురం: పోలిపల్లి పైడితల్లి, భోగాపురం కనకదుర్గమ్మ జాతరలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పూర్తి చేశారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వీలుగా ఆలయాల వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల భక్తులు ఇప్పటికే ఆలయాల వద్దకు చేరుకున్నారు.
అమ్మవార్లను దర్శించుకుని, తలనీలాలు చెల్లించి బోనాలు సమర్పించుకుంటారు. జాతర ప్రాంతాలు దుకాణాలు, సర్కస్‌లు, బొమ్మల దుకాణాలతో కళకళలాడుతున్నాయి. అలాగే ప్రధాన రహదారులు, ఆలయ ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఏస్పీ వకుల్ జిందల్ అదేశాల మేరకు సీఐ ఎన్వీ ప్రభాకర్, ఎస్సైలు పాపారావు, సూర్యకుమారి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు పీజీఆర్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment