ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సంరక్షణ కేంద్రం 1,100 ఎకరాల్లో ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాం. అన్నీ పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కందకం తవ్వకాలు, సంరక్షణ వల్ల రైతులకు గానీ, స్థానికులకు గానీ ఎటువంటి ఇబ్బందులూ రావు. కొంత భూభాగంలోనే పనులు చేపడుతున్నాం. ఇది కేవలం ‘ఎలిఫెంట్ హోల్డింగ్ టెంపరరీ’ మాత్ర మే. కొద్దిరోజులపాటే ఏనుగులను ఇక్కడ ఉంచుతాం. ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. ఇదే విషయం రైతులకు చెప్పాం.
– బిర్లంగి రామ్‌నరేష్, పార్వతీపురం రేంజ్ అటవీశాఖాధికారి