విజయనగరం ఫోర్ట్:
ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం వర్తించినప్పటకీ రోగుల నుంచి ఇంప్లాట్స్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడుతున్న వైనంపై ఈ నెల 17న సాక్షిలో ‘ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. పట్టణంలోని గాయత్రి ఆస్పత్రిలో వెన్నుపూస శస్త్రచికిత్స చేసుకున్న రోగి గోవింద నుంచి సిబ్బంది రూ. 25 వేలు వసూలు చేశారు. ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ జనార్దనరావు, ఆరోగ్యమిత్ర మురళీధర్ ఆస్పత్రి ప్రతినిధుల నుంచి రూ. 25 వేలు వసూలు చేసి బాధిత వ్యక్తికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ రోగుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆరోగ్యశ్రీ రోగికి డబ్బుల చెల్లింపు