ఊరి బడిని కాపాడుకుందాం...
మన ఊరి బడిని మనమే కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టేందుకు.. బడిని కాపాడుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఏకమవ్వాలని పిలుపునిస్తున్నారు. వీరఘట్టం మండలం కిమ్మి, గడగమ్మ గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం.. అంటూ నినదించారు. దీనికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఆందోళనలో ఆ సంఘ నాయకులు ఎస్.మురళీమోహనరావు, మజ్జి పైడిరాజు, అరసాడ చంద్రమోహన్, కర్రి సింహాచలం, బి.వాసుదేవరావు, శీలా గణేష్‌తో పాటు కిమ్మి సర్పంచ్ గురాన రామ్మోహనరావు, ఎస్‌ఎంసీ చైర్మన్ వాన సంతోషమ్మ, గడగమ్మ సర్పంచ్ వి.సూర్యనారాయణ, ఎస్‌ఎంసీ వైస్ చైర్మన్ పి.దయానంద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
– వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment