రామభద్రపురం: మండలకేంద్రంలోని సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ సతీష్‌పై దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా బుదవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సులోచనరాణితో కలిసి దర్యాప్తు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఏడాది క్రితం బీఎల్‌వో విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు అతడి సమాధానం కూడా బాగాలేదన్న ఉద్దేశంతో తహసీల్దార్ సులోచనరాణి ఆర్డీవోకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఆర్డీవో కూడా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అప్పటి కలెక్టర్ సదరు ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సదరు ఇంజినీరింగ్ అసిస్టెంట్ సతీష్‌కు దాదాపు 6 నెలల క్రితం పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. అయితే అప్పట్లో దర్యాప్తు సక్రమంగా జరగలేదని, ఇప్పుడు మళ్లీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్ సులోచనరాణిని అప్పట్లో ఏం జరిగిందో ఎస్‌డీసీ ప్రమీలా గాంధీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రత్నం పాల్గొన్నారు.