–IIలో
శనివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2025
ఇటీవల కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం... అరటి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేసింది. రైతన్న నడ్డివిరిచింది. ఆదుకోవాలంటూ అన్నదాత వేడుకుంటున్నా పాడైన పంటలను పరిశీలించేవారు, నష్టం అంచనా వేసేవారు కరువయ్యారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏటా పెట్టుబడి సాయంతో పాటు ఉచిత పంటల బీమా సదుపాయం వల్ల విపత్తుల సమయంలో రైతన్నకు ఆర్థిక సాయం ఠంచన్‌గా అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైతన్న ఆవేదన చెందుతున్నాడు.
దుకునేవారు లేక... !
సుభద్రమ్మవలస పామాయిల్ తోటలో ఏనుగుల గుంపు
ఇదీ ‘యంత్రాంగం’ తీరు..!
ప్రజాధనంతో కొనుగోలుచేసిన వ్యవసాయ యంత్ర పరికరాలు అనర్హులకు చేరుతున్నాయి.
సాక్షి, పార్వతీపురం మన్యం: మండువేసవిలో జిల్లాలో ఇటీవల కురిసిన వర్షం.. ప్రజానీకానికి ఉపశమనమిచ్చినా, ఉద్యాన రైతులకు మాత్రం తేరు కోని కష్టాన్ని మిగిల్చింది. రాత్రి సమయంలో దాదాపు రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల పొలాలు, కళ్లాల్లో నీరు చేరింది. గాలుల వల్ల చెట్లు నేలకొరిగాయి. ప్రధానంగా మొక్కజొన్న, అరటి పంటలకు వర్షం నష్టం మిగిల్చింది. రైతును ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. పంట నష్టం నిబంధనల వల్ల పరిహారం కూడా అందని పరిస్థితి దాపురించింది. ఇప్పటికీ నేలకొరిగిన పంటలను చూసి రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
పాలకొండ రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. పాలకొండ మండలం లుంబూరు గ్రామంలో వావిలపల్లి రమణమూర్తితో పాటు పలువురు రైతులకు చెందిన అరటి తోటల్లో జరిగిన నష్టాన్ని సంఘ ప్రతినిధులు పరిశీలించారు. అకాల వర్షం కారణంగా అరటి, జీడి, మామిడి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. కొద్ది రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో దిగుబడి నేలపాలైందన్నారు. ఉద్యాన, వ్యవసాయ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందజేయాలని కోరారు. ఈ పరిశీలనలలో రైతు సంఘ నాయకులు అప్పలనాయుడు, కిమిడి రామూర్మినాయుడు, పి.వైకుంఠరావు, దాసు తదితరులు ఉన్నారు.
చిత్రంలో మండుటెండలో నడుచుకుంటూ వెళ్తున్న గిరిజన విద్యార్థులది సీతంపేట మండలంలోని జమ్మడుగూడ గ్రామం. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో దాదాపు 16 మంది చిన్నారులు అర కిలోమీటరు దూరంలోని కాగుమానుగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. వాహన సదుపాయం లేకపోవడంతో ప్రతి రోజు నడవాల్సిందే. మండే ఎండలో ఇలా శుక్రవారం పాఠశాల విడిచిపెట్టిన తర్వాత క్యూ పద్ధతిలో నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. దాతలు దయతలచి ఆటో సదుపాయం కల్పిస్తే చిన్నారులకు ఈ కష్టాలు తప్పేవంటూ వీరిని చూసిన వారిలో చర్చసాగింది. – సీతంపేట
గత ఆదివారం రాత్రి జిల్లాలో 25.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షంతోపాటు, గాలులు వీయడం వల్ల పంటలకు నష్టం ఏర్పడింది. వీరఘట్టం, పాలకొండ, పార్వతీపురం, బలిజిపేట, సీతానగరం, భామిని తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో సీతానగరం మండలంలో కంకులదశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. పాలకొండ మండలంలో అరటిపంటకు నష్టం ఏర్పడింది. మండలంలోని లుంబూరు గ్రామానికి చెందిన వావిలపల్లి రమణమూర్తి అనే రైతుకు చెందిన సుమారు ఎకరా అరటి తోట గెలలతోసహా పడిపోయింది. పంట గెలలు వేసి మరి కొద్ది రోజుల్లో ఫలసాయం చేతికి అందుతుందనే సమయంలో నేలకొరగడంతో పెట్టుబడి కూడా దక్కదని రైతు ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలోని కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సైతం అరటిపంట దెబ్బతింది. బలిజిపేట మండలంలోని అరసాడ, చెల్లింపేట, పణుకువలస తదితర ప్రాంతాల్లో మొక్కదశలో ఉన్న నువ్వు చేను నీటపాలవ్వడం పంటను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడ్డారు. జిల్లాలో సుమారు 80 నుంచి 120 ఎకరాల వరకు అరటి పంటకు నష్టం వాటిల్లినట్టు సమాచారం.
నిబంధనల శరాఘాతం
పంటలో 33 శాతంపైగా నష్టం జరిగితేనే పరిహారం ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధన వల్ల రైతులకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవ అంచనాలు వేయించి, ప్రభుత్వ నిబంధనలను సవరిస్తేనేగానీ బాధిత రైతులకు పరిహారం అందే పరిస్థితి ఉండదు. కొన్నిచోట్ల పంటపై పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది.
భారీ వర్షం, గాలులకు జిల్లాలో అరటి పంట దెబ్బతింది. గెలలు నేలవారాయి. కొద్దిరోజుల్లో పంట ఫలసాయానికి వచ్చే సమయంలో ఈ విపత్తు సంభవించింది. ప్రభుత్వ నిబంధన మేరకు 33 శాతం దాటి నష్టం ఉంటే పరిహారం అందిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే రైతుకు పరిహారం అందడం కష్టమే. ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను ఆదుకోవాలి.
క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులను ఆదుకోవాలి
– బుడితి అప్పలనాయుడు,
జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం
న్యూస్‌రీల్
పశుతాగునీటి తొట్టెలు నిర్మాణం
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
ప్రభుత్వం స్పందించాలి
మొక్కజొన్న, అరటి రైతులకు కష్టం..
అకాల వర్షం.. రైతుకు నష్టం
నేలకొరిగిన అరటి
పట్టించుకోని యంత్రాంగం
నష్టపోయిన పంటలనూ పరిశీలించని వైనం
గగ్గోలు పెడుతున్న రైతు కుటుంబాలు
వేదనలో రైతన్న..
వేదనలో రైతన్న..
వేదనలో రైతన్న..
వేదనలో రైతన్న..