
ఆర్మీ లెఫ్టినెంట్‌గా శ్రీవాత్సవ్
వీరఘట్టం: మండలంలోని నీలానగరం గ్రామానికి చెందిన పెరుమాలి శ్రీవాత్సవ్ ఆర్మీ లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు చైన్నెలోని ఆర్మీకి చెందిన ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) నుంచి ట్రైనింగ్ లెటర్ వచ్చింది. ఆరు నెలల కిందట శ్రీవాత్సవ్ ఆర్మీ సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష రాసి, రెండు నెలల కిందట ప్రయాగ్‌రాజ్‌లో ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసుకున్నాడు. చైన్నెలో ట్రైనింగ్ పూర్తి చేస్తే లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీలో సేవలందించనున్నాడు. ఇతని తండ్రి సింహాచలం పోలీస్‌శాఖలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా.. తల్లి సునీత పాలకొండలోని ఓ ప్రైవే ట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
ఇదీ నేపథ్యం..
శ్రీవాత్సవ్ నీలానగరంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆరు నుంచి 12 వరకు విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. రాజాం జీఎంఆర్‌లో బీటెక్ పూర్తి చేశాడు. లెఫ్టినెంట్‌గా ఎంపిక కావడంతో గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.