
ప్రతీ విద్యార్థికి ‘అపార్’
పెద్దపల్లిరూరల్: ప్రతీ వ్యక్తికి ఆధార్ నంబరు ఎంతముఖ్యమో, ప్రతీ విద్యార్థికి ఏపీఏఆర్(అపార్) నంబరు అంతే ముఖ్యమని కలెక్టర్ కో య శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఆ యన అధికారులతో అపార్‌పై సమీక్షించారు. ఆటోమేటెడ్ పర్మినెంట్ అకౌంట్ రిజిస్ట్రీ(ఏపీఏఆర్–ఆపార్) నంబర్ ద్వారా విద్యార్థుల విద్యార్హత సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో భద్రపర్చుతారన్నా రు. ఇంటర్ వరకు ప్రతీవిద్యార్థికి అపార్ నంబ రు జనరేట్ చేయాలని, జిల్లాలో ఇప్పటివరకు 54శాతం మంది విద్యార్థులకు ఈ నంబరు కేటాయించామని తెలిపారు. మరోరెండు, మూడు రోజుల్లో 75శాతం నమోదు చేయాలని, ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. దీనిద్వారా వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లో సర్టిఫికెట్లు కోల్పోతే.. ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకా శం ఉంటుందని కలెక్టర్ వివరించారు. డీఈవో మాధవి తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రతపై నిర్లక్ష్యం వద్దు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): పారిశు ద్య పనుల్లో నిర్లక్ష్యం వద్దని బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. పలు డివిజన్లలో చేపట్టిన పారిశుధ్య పనులను శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి రోజువారీ మార్కెట్‌ను సందర్శించారు. అల్లూరులోని శ్మశానవాటిక వరకు రో డ్డు నిర్మిస్తామని తెలిపారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామన్, సూపర్‌వైజర్లు కుమారస్వామి, సార య్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
నీటి సమస్య తలెత్తవద్దు
ఎలిగేడు/జూలపల్లి(పెద్దపల్లి): వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య సూచించారు. మండల కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శనివా రం ఆయన పరిశీలించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎలిగేడు, జూలపల్లి మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఈ– పంచాయతీ ఆపరేటర్లతో సమావేశమయ్యారు. 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని సూ చించారు. ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో లు అరిఫ్, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి కులగణన
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో ఆదివారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తామని క మిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ తెలిపారు. సర్వే సందర్భంగా తాళం వేసిన ఇళ్లు, ఆసక్తి లేకపోవడం తదితర కారణాలతో వివరాలు ఇవ్వని కుటుంబాలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. రోజూ ఉదయం 9గంటల – సాయంత్రం 5గంటల వరకు జరిగే ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించాలని కమిషనర్ అరుణశ్రీ కోరారు.
యువతకు ఉచిత శిక్షణ
ఎలిగేడు(పెద్దపల్లి): యువత కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. నా నేస్తం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అర్షనపల్లి నర్సింగరావు స్మారక ఉచిత కంప్యూటర్ శిక్షణను శనివారం మండల కేంద్రంలో ఎమ్మె ల్యే ప్రారంభించి మాట్లాడారు. ట్రస్టు సేవల కోసం తన వంతుగా రూ.50వేలు విరాళం అందిస్తున్నానని తెలిపారు. ట్రస్టు గౌరవ అధ్యక్షుడు అర్షనపల్లి రాజేశ్వర్‌రావు, అధ్యక్షుడు కట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి వీరగోని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ విద్యార్థికి ‘అపార్’
Comments
Please login to add a commentAdd a comment