
విద్యార్థుల హాజరు పకడ్బందీగా నమోదు చేయాలి
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థి హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా కట్టుదిట్టంగా నమోదు చేయాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల హైస్కూల్‌ను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికల హాజరు శాతం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, విద్యాబోధన తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, ఎంఈవో సురేందర్, ప్రధానోపాధ్యాయురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు.
గైర్హాజరైన విద్యార్థులకు నేటి నుంచి ప్రాక్టికల్స్
జ్యోతినగర్(రామగుండం): గైర్హాజరైన విద్యార్థుల కోసం మంగళవారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు మళ్లీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన సోమవారం తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. మొదటి, రెండు, మూడో విడత పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థుల కోసం మరో అవకాశంగా ఈనెల 18 నుంచి పెద్దపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల్పన సూచించారు. టైంటేబుల్ కోసం ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.
రత్నాపూర్ పంచాయతీ ఆకస్మిక తనిఖీ
రామగిరి(మంథని): రత్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని సూచించారు. పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శికి సూచనలు చేశారు. పంచాయతీ కార్యదర్శి సంతోష్, కారోబార్ శ్రీనివాస్ ఉన్నారు.
20న ‘చలో విద్యుత్ సౌధ’
పెద్దపల్లిరూరల్/రామగుండం: సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈనెల 20న హై దరాబాద్‌లో చేపట్టే చలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీవీఏసీ జేఏ సీ జిల్లా కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ కోరారు. రామగుండం డీఈఈ కార్యాలయంలో సోమ వారం ప్రచార పోస్టర్ ఆయన ఆవిష్కరించా రు. అనంతరం జరిగిన కార్యమ్రంలో ఆయన మాట్లాడారు. చలో విద్యుత్ సౌధ కార్యక్రమా నికి వేలాది మంది తరలిరావాలని, వీరితో కలి సి సీఎండీకి వినతిపత్రం అందజేస్తామని విశ్వనాథ్ తెలిపారు. ఆర్టిజన్లను కన్వర్షన్ చేయకపోతే భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం తమ సమ స్యలు పరిష్కరించే వరకూ దశలవారీగా ఆందోళనలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల మహేశ్, సందిప్, కిరణ్, శ్యాం, అంజద్ ప్రసాద్, నాగరాజు, కృష్ణ, శ్రీనివాస్, శంకర్, సాంబనర్సయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల హాజరు పకడ్బందీగా నమోదు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment