
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
● బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): వేసవిలో తాగునీటి సమ స్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరపాలక సంస్థ కా ర్యాలయంలో సోమవారం వార్డు, నీటి సరఫరా వి భాగం అధికారులు, సిబ్బందితో కమిషనర్ సమావే శం నిర్వహించారు. సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో వేసవి కార్యాచరణ అమలు చేస్తున్నామని, నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఈఈ రామన్, డీఈఈ హన్మంతు నాయక్, శాంతిస్వరూప్, షాభాజ్, జమీల్, ఏఈలు తేజస్విని, మీర్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి
జ్యోతినగర్(రామగుండం): మొండి బకాయిలు వ సూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని కమిషనర్ అ రుణశ్రీ తెలిపారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో ఆమె ప ర్యటించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని సూచించారు. అనంతరం వివిధ డివిజన్లలో పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment