వండర్ బుక్ ఆఫ్ రికార్డు అందుకుంటున్న చందర్
కేక్ కట్ చేస్తున్న టీబీజీకేఎస్ నాయకులు
గోదావరిఖని: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. స్థానిక తిలక్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డు కో ఆర్డినేటర్ నుంచి అవార్డు అందుకున్నారు. అనంతరం ఈశ్వరకృప ఆశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి, పీటీ స్వామి, నడిపెల్లి మురళీధర్‌రావు, చల్ల రవీందర్‌రెడ్డి, గోపు అయిలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో..
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మనదిన వేడుకలు స్థానిక టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మి ఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నా యకులు మాదాసు రాంమూర్తి, నూనె కొమురయ్య, వడ్డెపల్లి శంకర్, చెల్పూరి సతీశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment