పరీక్షలు ప్రశాంతం
జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈసారి ఒక్క నిమిషం నిబంధన తొలగించిన విద్యాశాఖ అధికారులు.. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడంతో గైర్హాజరు బాగా తగ్గింది. మొత్తం 10,530 మంది విద్యార్థుల కోసం జిల్లావ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా అన్నింటా మౌలిక సౌకర్యాలు కల్పించారు. తొలిరోజు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు
జరిగినట్లు అధికారులు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment