
భయపెడుతున్న భానుడు
● ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి ● భారీగా పగటి ఉష్ణోగ్రతలు ● గరిష్టంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
జ్యోతినగర్: జిల్లాలో భానుడు ఎండ వేడిమికి ప్రజలు భయపడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గురువారం జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లిలో గరిష్టంగా ఉష్ణోగ్రత 44.5 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 34.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ప్రజలు ఎండ వేడిమికి బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు (డిగ్రీల సెల్సియస్‌లలో) ఇలా ఉన్నాయి..
మండలం ప్రాంతం కనిష్టం గరిష్టం
పాలకుర్తి ఈశాలతక్కళ్లపల్లి 34.1 44.5
రామగిరి ఆర్జీ–3 ముల్కలపల్లి 34.0 44.5
పెద్దపల్లి పాలితం 33.1 44.4
సుల్తానాబాద్ సుగ్లాంపల్లి 33.9 44.3
పెద్దపల్లి రంగంపల్లి 32.8 44.2
ఓదెల ఓదెల 32.9 44.2
సుల్తానాబాద్ కనుకుల 33.1 44.1
పెద్దపల్లి భోజన్నపేట 32.4 44.0