సాక్షి, అమరావతి : ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసే అవసరం తమకు లేదని, మామూలుగా సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాద సంస్థల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేస్తారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నారా చంద్రబాబునాయుడు ఆధారాల్లేని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎల్లోమీడియాతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబువి చౌకబారు రాజకీయాలు. ఎన్నికలప్పుడు మోదీని ఆయన ఎలా విమర్శించారో అందరికీ తెలుసు. ఎన్నికలైన తర్వాత మోదీని అద్భుతమైన నాయకుడని అంటున్నారు. ( కేసుల నుంచి రక్షణ కోసమే రాష్ట్రపతి వద్దకు.. )
అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుది. టీసీబీఐ, ఈడీ ఏపీలోకి రావడానికి వీల్లేదని గతంలో బాబు అన్నారు. ఇప్పుడు ప్రతిదానికి సీబీఐ విచారణ కావాలంటున్నారు. అధికారం పోయాక వ్యవస్థలపై నమ్మకం కలిగిందా?. రమేష్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే అక్కడ ప్రమాదం జరిగింది. ఎల్జీ పాలిమర్స్ విషయంలో గగ్గోలు పెట్టిన టీడీపీ ఎందుకు రమేష్ హాస్పిటల్ వ్యవహారంలో మౌనంగా ఉంది. తన వారు అయితే ఒక విధంగా వేరే వారు అయితే మరో విధంగా చంద్రబాబు వ్యవహరిస్తారు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment