ఢిల్లీ: రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే సీఎం కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సేవలు, విజలెన్స్ శాఖలను మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సౌరభ్ భరద్వాజ నుంచి తప్పించారు. ఆయా శాఖలను పబ్లిక్ వర్క్స్ శాఖా మంత్రి అతిశీకి అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ లేఖను కూడా పంపించారు.
మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లు జైలుకు వెళ్లడంతో వారికి కేటాయించిన శాఖలను సౌరభ్ భరద్వాజ, అతిశీకి కేటాయించారు. గత జూన్ నెలలోనే మంత్రి అతిశీకి అదనంగా రెవెన్యూ, ప్రణాళికలు, ఆర్థిక శాఖల బాధ్యతలను అప్పగించారు. కల్కీజీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆమెకు ప్రస్తుతం 14 శాఖలు కేటాయించారు. తాజా నిర్ణయంతో ఢిల్లీ ప్రభుత్వంలో అతి ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్న ఏకైక మహిళా మంత్రిగా అతిశీ నిలిచారు.
తాజాగా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం జరిగిన వెంటనే భరద్వాజ నుంచి శాఖలను తప్పిస్తూ ప్రభుత్వం మార్పులు జరిపింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదంపై రాజ్యసభలో జరిగిన చర్చలో విజిలెన్స్, సేవలకు సంబంధించిన శాఖలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు మార్పులు చేర్పులు చేశారు. ఈ ఏడాది మార్చిలోనే అతిశీ, భరద్వాజ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదీ చదవండి: సమావేశాలు ముగిసే వారకు రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సస్పెన్షన్..
Comments
Please login to add a commentAdd a comment