
సాక్షి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం సహా బీఆర్‌ఎస్ నేతలు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని.. వాళ్ల పాస్‌పోర్టులు సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్‌ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. అవినీతి భాగోతాలు బయటపడతాయనే భయం వాళ్లలో ఉంది. అందుకే వాళ్ల పాస్‌పోర్టులు సీజ్ చేయండి. లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణాను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారాయన.
బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతే!
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. దేశమంతా మోదీ హవా నడుస్తోంది. ముచ్చటగా మూడోసారి 350 సీట్లతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ అడ్రస్ ఇక గల్లంతే. పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment