కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?: బండి సంజయ్‌ సెటైర్లు | Bandi Sanjay Slams Congress Govt Over Telangana Budget 2024-25, More Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?: బండి సంజయ్‌ సెటైర్లు

Published Thu, Jul 25 2024 4:29 PM | Last Updated on Thu, Jul 25 2024 5:23 PM

Bandi Sanjay Slams congress For Telangana Budget

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై కేంద్ర మోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్+రాష్ట్ర బడ్జెట్=గాడిద గుడ్డేనా?.. 6 గ్యారంటీలు+రాష్ట్ర బడ్జెట్=గాడిద గుడ్డేనా? అంటూ సెటైర్లు వేశారు.గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమని మండిపడ్డారు.  ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క  చదివింది ఆర్దిక బడ్జెట్టా లేక అప్పుల పత్రమా..? అంటూ దుయ్యబట్టారు.

రాష్ట్రంలో అప్పులున్నందున హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా? అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. అప్పులున్న విషయం ముందు మీకు తెలిసి కూడా 6 గ్యారంటీలిచ్చిన మీరు వాటన్నింటికీ బడ్జెట్‌లో నిధులెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. బడ్జెట్ కేటాయింపులకు సరిపడ ఆదాయం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో బడ్జెట్‌ో లెక్కా పత్రం చూపకపోవడం విడ్డూరమన్నారు.

‘సర్కారీ భూములన్నీ అడ్డికి పావుశేరు అమ్మాలనుకుంటున్నారా?. ఔను.. హామీలను అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ కు మాటలెక్కువని బడ్జెట్ చూస్తే అర్ధమవుతోంది. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన మీరు 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా కేటాయించని మీరా కేంద్రంపై విమర్శలు చేసేది?

రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా  కేటాయించకపోవడం మతతత్వం కాదా?. ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందూ ప్రజలకు తీవ్రమైన నష్టం చేయడమేనా మైనారిటీ డిక్లరేషన్ అంటే?రుణమాఫీవల్ల రైతులకు లాభం కంటే నష్టమే జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుంది. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారా? లేదా? చెప్పాలి.  ఏడాదిపాటు నష్టపోయిన ‘రైతు భరోసా’, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను కూడా ఈ ఏడాది చెల్లిస్తారా? లేదా?

జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వ్రుద్ధి రేటు తక్కువ నమోదు కావడమే 10 ఏళ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు అద్ధం పడుతుంది. కేబినెట్ మంత్రుల మధ్యే సఖ్యత లేదు.. తెలంగాణలో సమసమాజం స్థాపిస్తామనడం శతాబ్దం జోక్. ఇప్పటికైనా పీఎం ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించడం సంతోషం. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే.. 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం దారుణం. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు.

ఇందిరమ్మ ఇండ్లు, ట్రిపుల్ ఆర్ నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం విడ్డూరం. బడ్జెట్‌లోని చివరి పేజీలో ప్రస్తావించిన మహాత్ముడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, అప్పులకు.. మీరిచ్చిన అమలుి కాని హామీలకు మధ్య ఉన్న అంతరాన్ని గ్రహించండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాబోయే ఐదేళ్లలో కూడా అమలు చేయడం అసాధ్యమని బడ్జెట్ లోనే తేలింది

బడ్జెట్‌లో  ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదు.. సీఎంసహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా?. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని.. రాష్ట్రానికి ఘోర అన్యాయం ప్రజలను రెచ్చగొట్టిన  కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్ లో ఏ ఒక్క జిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా... దీనికేం సమాధానం చెబుతారు? బడ్జెట్‌లో పేరు ప్రస్తావించకపోయినంత మాత్రాన ఆ ప్రాంతాలకు అన్యాయం చేసినట్లా? రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement