సాక్షి, హైదరాబాద్: బెంగాల్ మార్క్ రాజకీయాల దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందా ? ఇక్కడా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడుల సంస్కృతి పెరగనుందా ? రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. ఇటీవలి పరిస్థితులు, అర్వింద్ ఇంటిపై దాడి వంటి తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం.. బెంగాల్ తరహా రాజకీయాల వైపు మనం అడుగులు వేస్తున్నట్టేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున రెండు పార్టీలు ఇదే ఒరవడిని, మరింత దూకుడును ప్రదర్శించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. గతంలో ధాన్యం కల్లాల పరిశీలనకు వెళ్లినపుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ శ్రేణుల దాడిని, ఆ తర్వాత ప్రజా సంగ్రామయాత్ర సందర్భంగా సంజయ్, ఇతర నాయకులపై దాడిని, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
ఇటీవలి టీఆర్‌ఎస్ విస్తృ్తత స్థాయి సమావేశంలో బీజేపీకి ఏ మాత్రం భయపడకుండా ధీటుగా బదులివ్వాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు, బీజేపీ విమర్శలకు టీఆర్‌ఎస్ స్పందనలు దీనినే స్పష్టం చేసేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పశి్చమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు, పరిణామాలు పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. అక్కడ ఎన్నికల ప్రచా రం మొదలు కావడానికి ఎంతో ముందుగానే రెండు పారీ్టల నేతలు, కార్యకర్తల మధ్య దాడులు, ప్రతి దాడులు తీవ్రస్థాయిలో జరిగాయి. ఆ తర్వాత అవి హత్యా రాజకీయాల వైపు కూడా దారితీసిన సంగతి తెలిసిందే.
చదవండి: కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment