ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మద్దతు ధరపై యూటర్న్ తీసుకున్నారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కుర్చీని ఎడమ కాలి చెప్పుతో పోల్చి అగౌరవ పరిచిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు తెగించి రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని, ఈ చట్టాలు అమలైతే రైతులు బానిసలవుతారని భట్టి పేర్కొన్నారు. అన్నం పెడుతున్న రైతుల కడుపు కొట్టవద్దని విఙ్ఞప్తి చేశారు. ఐకేపి సెంటర్ల ద్వారా రైతుల పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్‌దేనని చెప్పారు. రానున్న రోజుల్లో మద్దతు ధర కోసం పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని చెప్పారు. పసల్ బీమా యోజన రాష్ట్ర వాటా చెల్లించడం లేదని, వాటా కట్టనందున 960 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment