
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హైకోర్టులో దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ తిరస్కరించింది. కరీంనగర్‌లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. తనపై కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని బండి సంజయ్ విన్నవించారు. అత్యవసర విచారణ చేపట్టాలన్న సంజయ్ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది.
సంబంధిత వార్త: సీపీ నా గల్లా పట్టుకున్నారు: బండి సంజయ్
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్.. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని పిటిషన్‌ను తిరస్కరించింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసులు విచారణ జరిపే సంబంధిత కోర్టుకు వెళ్ళాలని బండి సంజయ్ తరపు న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్‌ను సంబంధిత బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment