బీజేపీకి సీనియర్ నేత ఖడ్సే రాంరాం! | BJP Senior Leader Eknath Khadse May Join In NCP Soon | Sakshi
Sakshi News home page

బీజేపీకి సీనియర్ నేత ఖడ్సే రాంరాం!

Published Tue, Oct 20 2020 1:36 PM | Last Updated on Tue, Oct 20 2020 2:49 PM

BJP Senior Leader Eknath Khadse May Join In NCP Soon - Sakshi

మళ్లీ ఈ నెల 22న ముహూర్తం ఖరారైనట్లు సమాచారం రావడంతో ఇప్పుడైనా కార్యరూపం దాలుస్తుందా..? లేదా..? అని ఇరు పార్టీల కార్యకర్తలు ఆయోమయంలో ఉన్నారు. కాగా, ఇంతవరకు తను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ముహూర్తం ఎప్పడనేది అధికారికంగా తను ప్రకటించకుండానే మీడియా  వదంతులు లేవనెత్తిందని ఖడ్సే దుయ్యబట్టారు.

సాక్షి, ముంబై: బీజేపీలో అసంతృప్తితో కొనసాగుతున్న సీనియర్‌ నాయకుడు ఏక్‌నాథ్‌ ఖడ్సే ఎన్సీపీలో చేరడం దాదాపు ఖారారైంది. ఈ నెల 22వ తేదీన పవార్‌ సమక్షంలో ఎన్సీపీలో చేరబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఆయన మద్దతుదారులు ఆనందంలో మునిగిపోయారు. ముంబైలోని ఎన్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీలో చేరుతారని సమాచారం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవి విగ్రహం ప్రతిష్టించే రోజు అంటే ఈ నెల 17వ తేదీన ఆయన ఎన్సీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. చివరకు అదికూడా వాయిదా పడింది.
(చదవండి: పార్టీ ఎమ్మెల్యేకు‌‌ జేపీ నడ్డా స్ట్రాంగ్‌ వార్నింగ్)

మళ్లీ ఈ నెల 22న ముహూర్తం ఖరారైనట్లు సమాచారం రావడంతో ఇప్పుడైనా కార్యరూపం దాలుస్తుందా..? లేదా..? అని ఇరు పార్టీల కార్యకర్తలు ఆయోమయంలో ఉన్నారు. కాగా, ఇంతవరకు తను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ముహూర్తం ఎప్పడనేది అధికారికంగా తను ప్రకటించకుండానే మీడియా  వదంతులు లేవనెత్తిందని ఖడ్సే దుయ్యబట్టారు. అదేవిధంగా ఖడ్సే రాజీనామా విషయం తనకు తెలియదని, రాజీనామా లేఖ తన వద్దకు ఇంతవరకు రాలేదని బీజేపీ ప్రదేశ్‌ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ స్పష్టం చేశారు.                  

ఇదిలాఉండగా ఖడ్సే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, గురువారం ఎన్సీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైందనిసోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఖడ్సే మద్దతుదారులు ఏర్పాట్లు చేయడానికి ముంబైకి బయలుదేరినట్లు సమాచారం. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయిన ఖడ్సే మద్దుతుదారులు, ఎన్సీపీ పదాధికారులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి అయోమయానికి గురిచేస్తున్నారని రాజకీయ పారీ్టలు అంటున్నాయి. 

ఫడ్నవిస్‌తో కుదరక.. 
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం హయాంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏక్‌నాథ్‌ ఖడ్సే తరుచూ బీజేపీపై వ్యాఖ్యలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అభ్యరి్థత్వం ఇవ్వకుండా పక్కన బెట్టడానికి ఫడ్నవిస్‌ కారణమని ఆరోపనలు గుప్పించారు. కనీసం విధాన్‌ పరిషత్‌కు వెళ్లేందుకు కూడా అవకాశమివ్వలేదు. అందుకు ఫడ్నవిస్‌ ప్రధాన కారణమని ఆరోపించారు. దీంతో ఖడ్సే, ఫడ్నవీస్‌ మ«ధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైంది. ఫడ్నవీస్‌ హాజరైన పార్టీ కార్యక్రమాలకు ఖడ్సే గైర్హాజరయ్యేవారు కాదు. చాలా రోజులుగా ఒకే వేదికపై ఇద్దరు దర్శనమివ్వలేదు. ఇక ఖడ్సే వేరే పార్టీలో చేరతారని అనుకున్నా.. ఏ పారీ్టలో చేరుతారనే దానిపై స్పష్టత రాలేదు. కొద్ది రోజులుగా ఆయన ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో  భేటీ కావడంతో అనుమానాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement