యూసీసీ అమలుపై 'పీయూష్ గోయల్' కీలక ప్రకటన | BJP Will Implement UCC After Returning to Power Says Piyush Goyal | Sakshi
Sakshi News home page

యూసీసీ అమలుపై 'పీయూష్ గోయల్' కీలక ప్రకటన

Published Mon, Apr 15 2024 6:07 PM | Last Updated on Mon, Apr 15 2024 7:04 PM

BJP Will Implement UCC After Returning to Power Says Piyush Goyal - Sakshi

ముంబై: త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయడానికి దేశంలోని చిన్నా, పెద్దా.. పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ అగ్రనేతలు కూడా రంగంలోకి దూకారు. ఈ తరుణంలో ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయడానికి సిద్దమైన 'పీయూష్ గోయల్' కీలక ప్రకటనలు చేశారు.

దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)అమలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను కూడా తోసిపుచ్చారు.

యూనిఫాం సివిల్ కోడ్ అనేది భారతదేశంలో పౌరుల కోసం వ్యక్తిగత చట్టాలను రూపొందించి అమలు చేయడానికి అవసరమైన ఒక ప్రతిపాదన. ఇది వారి మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తిస్తుంది. ప్రస్తుతం, వివిధ సంఘాల వ్యక్తిగత చట్టాలు వారి మత గ్రంథాలచే నిర్వహించబడుతున్నాయి.

దేశంలో యూసీసీని అమలు చేయాలని బీజేపీ నిర్చయించుకుందని, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తప్పకుండా అమలు చేస్తామని పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కసరత్తు చేసిందని కూడా పేర్కొన్నారు. అంతే కాకుండా వికసిత్ భారత్ కేవలం నరేంద్ర మోదీతోనే సాధ్యమని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement