ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చర్చలు జరపడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగేళ్లుగా కమలనాధుల కటాక్షం కోసం పరితపిస్తున్న చంద్రబాబు తాజాగా ఎన్టీఆర్ కార్యక్రమాన్ని తన రాజకీయాలకు వేదికగా చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం తన భార్య సోదరి పురందేశ్వరి ఉపయోగించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి చంద్రబాబు ముందుగానే చేరుకున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి వచ్చారు. అదే అదనుగా భావించి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట కలిపారు. ఓ వైపు కార్యక్రమం నడుస్తుండగానే చంద్రబాబు వంగిమరి జేపీ నడ్డా చెవిలో గుసగుసలు కొనసాగించారు. ఆ తర్వాత కార్యక్రమం ముగియగానే తేనేటి విందు జరిగింది.
అక్కడ జేపీ నడ్డాతో పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చర్చిస్తుండగా చంద్రబాబు మరోసారి చేరుకున్నారు. టీ తాగి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనంతరం చంద్రబాబు రెండో విడత చర్చలు నడ్డాతో మొదలు పెట్టారు. ఈసారి పురంధేశ్వరి సైతం చర్చల మధ్యలో ఉన్నారు. వీరు ముగ్గురు దాదాపు పది నిమిషాలు రాజకీయ అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. ఓ వైపు పవన్, నాదెండ్ల మనోహర్ ద్వారా బీజేపీ పొత్తు కోసం లాబీ చేస్తున్న బాబు , ఈ సారి పురంధేశ్వరి ద్వారా బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారట.
ఇందుకోసం తాజాగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు చేతిలో తన తండ్రికి, తన భర్తకి జరిగిన అన్యాయాన్ని పురంధేశ్వరి మరిచి బాబు స్వార్థ రాజకీయాలకు సహకరించడం పై ఇంటా, బయట విమర్శలు వస్తున్నాయి. అయితే, చంద్రబాబు స్వభావం తెలిసిన కమలనాథులు ఇప్పటికే బాబుకి ఇవ్వాల్సిన సందేశం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు ఆయన వల్ల రాజకీయాలలో ఎదిగిన బాబు, ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని తన రాజకీయాలకు వాడుకోవడం విషాదం. దానికి పురందేశ్వరి లాంటి వారు సైతం సహకరించడం సరైంది కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ మనిషి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నా
మామకే వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ నుంచి సీఎం కుర్చీని లాగేసుకున్న వ్యక్తి చంద్రబాబని సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. సోమవారం నగరిలో విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారని మండిపడ్డారు.
‘ఎన్టీ రామారావును సీఎం కుర్చీని వీళ్లే లాగేసుకున్నారు. వెన్ను పోటు పొడిచారు. పార్టీని లాగేసుకున్నారు. ఎన్టీఆర్ చావుకు వీళ్లే కారణం అయ్యారు. ఇదే దుర్మార్గుడు ఇదే ఎన్టీఆర్ చనిపోగానే శవాన్ని లాక్కుకుంటారు. ఫొటోలకు దండలేస్తారు. ఫొటో ముందు ప్రతి రోజూ దండం పెడుతూ తిరుగుతారు. ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తుంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు ఇదే చంద్రబాబు. ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నా’ అని సీఎం జగన్ ప్రశ్నించారు.
చదవండి: నన్ను పిలవకపోవడం దుర్మార్గం.. అసలు విలన్ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి
Comments
Please login to add a commentAdd a comment