
ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు
నాడు తిట్టిన నోటితోనే పొగిడిన బాబు
మోదీ కీర్తనల్లో తరించిన చంద్రబాబు
పగవాడికి కూడా రాకూడని కష్టం చంద్రబాబుకు వచ్చింది.. జస్ట్ ఐదేళ్ల క్రితం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత మోదీని.. బీజేపీని చంద్రబాబు ఏన్నేసి మాటలన్నారు. ధర్మపోరాట దీక్షలు అంటూ జిల్లాకు కోటి ఫండ్స్ రిలీజ్ చేసి మరీ మోదీని అయన తిట్టడమే కాకుండా క్యాడర్.. ఎమ్మెల్యేలు.. ఎంపీలతో సైతం తిట్టించారు.. మోదీని బహుశా రాజకీయ శత్రువులు.. కాంగ్రెస్ వాళ్ళు సైతం అన్ని తిట్లు తిట్టలేదేమో!
చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ఒకసారి ఏపీకి మోదీ వస్తుంటే.. ఎందుకు వస్తున్నారు? సిగ్గుందా? అని ట్వీట్ చేశారు చంద్రబాబు. ఇప్పుడు మళ్ళా చాన్నాళ్ల తరువాత మోదీతో చిలకలూరిపేటలో వేదిక పంచుకున్న చంద్రబాబు.. మళ్ళీ మోదీ భజన మొదలెట్టారు. మేకిన్ ఇండియా.. వికసిత భారత్.. అమృత్ భారత్.. ఇలా ఒకటా రెండా ? ఆయన్ను కీర్తిస్తూ చాలాసేపు మాట్లాడారు .
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ
మోదీ అంటే ఆత్మవిశ్వాసం
మోదీ అంటే ఆత్మగౌరవం
మోదీ అంటే అభివృద్ధి
మోదీ అంటే సంక్షేమం
మోదీ అంటే ఒక వ్యక్తి కాదు
మోదీ అంటే భారత్ ను విశ్వ గురువు గా మారుస్తున్న శక్తి...
మోదీ అంటే సబ్ కా సాత్
మోదీ అంటే సబ్ కా వికాస్
మోదీ అంటే సబ్ కా విశ్వాస్
ఇలా ఒకటే కీర్తనలు.. ఒకటే చిడతలు.. ఒకటే భజన..
ఆనాడు ‘‘ఏయ్ మోదీ.. నువ్వో ఉగ్రవాదివి.. నువ్వో టెర్రరిస్ణ్టువి నిన్ను ఉరితీయాలి.. పెళ్ళాన్ని చూడలేనివాడు.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా అని ఆనాడు వెక్కిరించినా చంద్రబాబు నేడు అదే నోటితో మోదీని కీర్తించడం చూసి బీజేపీ క్యాడర్ విస్తుపోయింది.. అవకాశం వస్తే బాబు ఇంతలా దిగజారిపోతాడా? అని ముక్కునవేలేసుకుంది .
మరోవైపు మోడీ కూడా ఆంధ్రకు ఏమి చేసాం అన్నది వివరించారు.. విశాఖలో ఐఐఎం .. గోదావరి జిల్లాలో నిట్.. తిరుపతిలో ఐఐటి.. మంగళగిరిలో ఎయిమ్స్ ఇలా కేంద్రం ఇచ్చిన విద్యాసంస్థల గురించి వివరించారు తప్ప ఆనాడు చంద్రబాబును విమర్శించిన రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దునుమాడలేదు. ఇక సభ ఆద్యంతం మైకులు మొరాయించాయి.. ప్రతి ఐదు నిముషాలకు ఒకసారి మైకులు కట్ అవడంతో టీవీల్లో చూసేవాళ్ళు అసహనానికి లోనయ్యారు.
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment