
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్‌లపై ఎన్ని కేసులున్నాయో తనకు తెలుసునని, ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, తిరిగి అధికారంలోకి రావడానికి మాత్రమే చంద్రబాబు ఢిల్లీ ప్రయాణమవుతున్నాడని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు.
టీడీపీ నాయకుడు పట్టాభి సీఎం జగన్‌ను అటువంటి పదజాలంతో తిట్టడం ముమ్మాటికీ తప్పేనన్నారు. చంద్రబాబు దాన్ని సమర్థించడం సరికాదన్నారు. బాబు ఎందుకు దీక్షలు చేస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం తాను ప్రయత్నిస్తానని చింతా మోహన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment