న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పందించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు వర్చువల్‌గా హాజరువుతానని తెలిపారు. అది కూడా మార్చి 12వ తేదీ తర్వాతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అయితే తాజాగా కేజ్రీవాల్ విచారణపై ఈడీ బదులిచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం లేదని దర్యాప్తు సంస్థ తెలిపింది. కాగా ఫిబ్రవరి 27న లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు పంపిన విషయం తెలిసిందే. మార్చి నాలుగో తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే ఎప్పటిలాగే ఈడీ నోటీసులను ఢిల్లీ సీఎం భేఖతారు చేశారు. దర్యాప్తు స్థంస్థ విచారణకు ఆయన హాజరు కాలేదు.
ఇక గతంలోనూ ఈడీ విచారణకు ఏడుసార్లు కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులు చట్టవిరుద్దమంటూ, రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన ఆరోపించారు. పదే పదే సమన్లు పంపడం మానుకోవాలని, కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూడాలని పేర్కొన్నారు.
చదవండి: తృణమూల్ కాంగ్రెస్‌కు 'తపస్ రాయ్' గుడ్ బై - కారణం ఇదే..
Comments
Please login to add a commentAdd a comment