లోక్‌సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
బీజేపీ, ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు
‘గాడిద గుడ్డు’ ప్రచారాన్ని సీఎం ప్రజల్లోకి తీసుకెళ్లారంటున్న కాంగ్రెస్ నేతలు
14 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని ధీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తన భుజాలపై వేసుకొని తెలంగాణ అంతా చుట్టివచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగిన జన జాతర సభతో ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచా రం మొదలవగా 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలలో రేవంత్ పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి ముఖ్యమంత్రి పలు సభల్లో పొల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదే శాల మేరకు కర్ణాటక, కేరళలలోనూ పర్యటించి బహిరంగ రోడ్ షోలలో ప్రచారం చేపట్టారు.
ఈ ప్రచారంలో సీఎం ప్రధానంగా బీజేపీని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని ఆయన వ్యాఖ్యనించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆయన చేసిన ప్రసంగాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు కలిసి వచ్చాయని ఆ పార్టీ భావిస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై మోదీ, అమిత్ షా మొదలు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వరకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్రానికి బీజేపీ ‘గాడిద గుడ్డు’ తప్ప ఏమిచ్చిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం విజయం సాధించారని పేర్కొన్నారు. తమ ప్రచారానికి అనూహ్య రీతిలో ప్రజా స్పందన వచ్చిందని.. అందువల్ల 14 సీట్లలో గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment