సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో గత 60 ఏళ్లలో ఎన్నడూ జరగని విధ్వంసం బీఆర్‌ఎస్ హయాంలో జరి గిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిజాం కూడా ఇంత విధ్వంసం చేయలేదని, తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమేనా అన్నట్టు దోపిడీ జరుగుతోందని బుధవారం గాందీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కుటుంబ స్వార్థానికి హైదరాబాద్ నగరాన్ని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంత నైసర్గిక స్వరూపం నేపథ్యంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, ఇక్కడ ఇళ్లు, వ్యాపార సంస్థల నిర్మాణానికి 5 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు.
16 అంతస్తులకు ఎలా అనుమతులు
కానీ, కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ అనే సంస్థ కు 16 అంతస్తులు కట్టుకునేలా అనుమతినిచ్చారని రేవంత్ చెప్పారు. కేబీఆర్ పార్కు సమీపంలో కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ సంస్థ 7,416 గజాల స్థలంలోని ఓ హెరిటేజ్ భవనాన్ని నిజాం నవాబుల నుంచి కొనుగోలు చేసిందనీ, అందులో రోడ్డు వెడల్పు పోగా 6,900 గజాలు మిగిలిందని, అందులోనూ 1,200 గజాలు గ్రీన్‌బెల్ట్ కింద పోనూ 5,800 గజాలు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఉంటుందని వివరించా రు.
ఈ 5,800 గజాల్లో 60 వేల చదరపు అడుగులకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఆ స్థలంలోని 2,704 చదరపు గజాలను కేసీఆర్ సన్నిహితుడు దామోదర్‌రావుకు అప్పనంగా ఇచ్చారని, ఆ స్థలాన్ని రాసిచ్చి న తర్వాత కేఎస్‌అండ్ సీఎస్ సంస్థకు 4 అంతస్తులు భూమి లోపల, 16 అంతస్తులు భూమిపైన కట్టుకునే విధంగా 4,78,825 చదరపు అడుగుల నిర్మాణానికి అనుమతినిచ్చారని రేవంత్ ఆరోపించారు.
40 కోట్లు ఇస్తే.. ఆ భూమిని ఇస్తారా?
అక్కడ రూ.100 కోట్ల విలువైన 2,704 గజాల భూమిని కేవలం రూ.17 కోట్లు చెల్లించి తీసుకున్నారని రేవంత్ నిందించారు. రూ.40 కోట్లు ఇస్తే ఆ భూమిని కేసీఆర్ ఇవ్వగలడా అని సవా ల్ విసిరారు. కేసీఆర్ అండ్ కో బెదిరించి భూ ములు రాయించుకున్నారడానికి ఇంతకంటే నిదర్శనం లేదని, దోపిడీ అనే పదం కూడా కేసీఆర్ దోపిడీ ముందు చిన్నబోతుందని వ్యాఖ్యా నించారు. కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని గురువారం ఉదయం 11 గంటలకు మీడియాను తీసుకెళ్లి చూపిస్తానని చెప్పారు. డీ9 గ్యాంగ్ రాష్ట్రాన్ని దోచుకుంటోందని, వీరిలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment