సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపిన అర్వింద్.. కిషన్‌రెడ్డి పార్టీకి ఒక లక్కీ హ్యాండ్ అని స్పష్టం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. ‘జేపీ నడ్డా.. అజాత శత్రువు.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పరిపక్వత కల్గిన పొలిటీషయన్ కిషన్‌రెడ్డి. ఆయన్ను నియమించినందుకు ధన్యవాదాలు. ఈటలకు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు నడ్డాకు కృతజ్ఞతలు. 2024 లో మూడోసారి ప్రధాని మోదీ పీఎం అవుతారు.
ఈటల తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్‌గా వెళ్తారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. బండి సంజయ్ అగ్రెసివ్‌గా తన టర్మ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మేమంతా కలిసి పనిచేస్తాం.. అధికారంలోకి తీసుకువస్తాం. ఎంపీగా గెలవలేని వ్యక్తి రాహుల్.. ఆయన కూడా మాపై వ్యాఖ్యలు చేస్తాడా?, కాంగ్రెస్‌ను లేపడానికి కొన్ని ఛానళ్లు బాగా కష్ట పడుతున్నాయి. మీడియా కథనాలతో ప్రజలను మభ్యపెట్టలేరు. రాహుల్ కు రాజకీయం నేర్పేందుకు కొన్ని ఛానళ్లు క్లాసులు ఇస్తున్నాయి.
చచ్చిపోయిన పీనుగులాంటి కాంగ్రెస్ పార్టీ.. 12 వేల ఓట్లతో గెలిచిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకుంటే అధికారంలోకి వస్తుందా?, కవిత అరెస్ట్ విషయంలో పొలిటికల్ ఇన్వాల్వ్ మెంట్ ఉండదు. తప్పు చేసిన వారిని, అవినీతి చేసిన వారిని బొక్కలో వేస్తామని మోదీ హామీ ఇచ్చారు.. కేటీఆర్ కు ఇంకా ఏం హామీ ఇవ్వాలట. కవిత జైలుకు వెళ్లేముందు ఒక్కదాన్నే వెళ్లను.. అందరినీ తీసుకు వెళ్తామని అందని చెప్తున్నారు. నాకు, బండికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. కవిత విషయంలో సంజయ్ కామెంట్స్ చేసినప్పుడు నా టంగ్ స్లిప్ అయి నేను కూడా కామెంట్స్ చేశా’ అని పేర్కొన్నారు.
చదవండి: బీజేపీ స్ట్రాటజీ.. తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌ల మార్పు
బీజేపీలో కిషన్‌రెడ్డి బలం అదే.. ఆయనే ఇక తెలంగాణలో పార్టీ గేమ్‌ఛేంజర్!
Comments
Please login to add a commentAdd a comment