![Farmer Minister Perni Nani Fires on Janasena chief Pawan Kalyan - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/12/perni-nani.jpg.webp?itok=A1zTgW64)
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సభలో పవన్ తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికే సరిపోయిందని మండిపడ్డారు. ఏరా, ఒరే అనడమేనా నీ సంస్కారం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు స్వభావం గల వ్యక్తి పవన్. పవన్.. ఇదేనా నీ వ్యక్తిత్వం? అంటూ ప్రశ్నించారు.
ఈమేరకు మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. మైకు దొరికిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా?. నీ ప్రసంగం ఎవరికైనా ఉపయోగపడుతుందా?. పవన్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, పరనింద. సినిమా డైలాగ్స్‌కే పవన్ ప్రసంగం సరిపోయింది. సభకువచ్చిన జనాన్ని నమ్మను అని చెప్పడమే దౌర్భాగ్యం. మీరు నాకు నమ్మకం ఇవ్వగలరా అని జనాన్నే ప్రశ్నిస్తున్నాడు. నిన్ను నమ్మి వచ్చిన వారితో మాట్లాడే భాషేనా ఇది?. నిన్ను అభిమానించి వచ్చిన వారిని కూడా కించపరుస్తావా? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ మూడు ముక్కల రాజకీయ నాయకుడు. పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి. ఓ వైపు బీజేపీతో మరోవైపు టీడీపీతో రాజకీయం. గతంలో చంద్రబాబు, నువ్వు కలిసి ఎన్ని ఉద్యోగాలిచ్చారు?. 2014లో నిరుద్యోగం కనిపించలేదా?. దేశంలో పవన్ ఒక్కడే బరితెగింపు రాజకీయం చేస్తున్నాడు. సభకు వచ్చిన జనాన్ని నమ్మనని పవన్ ఎలా అంటారు?. చంద్రబాబుకు, నీకు వచ్చినవి దిక్కుమాలిన రాజకీయాలే. కాపులను మోసం చేశావు.. బీసీలను మోసం చేశావు. స్టేజ్ మీద బీసీలను ఎందుకు కూర్చోబెట్టలేదు? అని పేర్ని నాని వరుస ప్రశ్నలు సంధించారు.
చంద్రబాబును తిట్టి ఆ ఇంటికే వెళ్లి టీలు తాగుతున్నావు. ఇంతకంటే దిక్కుమాలిన రాజకీయ చరిత్ర ఎవరికైనా ఉందా?. పవన్ కల్యాణ్ ఎవరితోనైనా పోరాటం చేశారా?. ఆయనవి బిల్డప్ బాబాయ్ మాటలు. మాది నియంత ప్రభుత్వం అయితే నీ మీటింగ్‌కు పర్మిషన్ వస్తుందా?. బాలకృష్ణ సినిమాకు టికెట్ రేట్ పెంచుకునేందుకు పర్మిషన్ వచ్చేదా?. అని ప్రశ్నించారు.
శ్రీకాకుళంలో ఫిషింగ్ హార్బర్ ఎందుకు కట్టించలేదు?. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కట్టిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు చేసింది పోరాటమా.. ఆరాటమా?. చంద్రబాబు, పవన్ కలిసి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. దేశ బాగోగుల గురించి కాకుండా అంబటి, అమర్నాథ్ గురించి మాట్లాడుతారా?. చంద్రబాబుతో నీకు ఉన్న సంబంధాన్ని ఒప్పుకున్నావు. అదే విషయం వైఎస్ జగన్ చెబితే ఎందుకు ఉలికిపాటు?. చంద్రబాబు మత్తులో ఉన్న దేవుడు కూడా రక్షించలేడు అని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు.
ఆడవాళ్ల గురించి అసభ్యంగా మాట్లాడతావా?. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చులకనా?. మీ ఇంట్లో ఆడవాళ్లు సినిమాల్లో నటించలేదా?. ముందు మహిళలకు మర్యాద ఇవ్వడం నేర్చుకో. చంద్రబాబు చంకనెక్కబోతున్నానని పవన్ చెబుతున్నాడు. ఇవాళ్టితో పవన్ ముసుగు తొలగిపోయింది. 2009లో పంచె ఊడదీస్తానని 2014 దాకా పత్తా లేడు. రాజకీయాల్లో పవన్‌కు వచ్చిన దిక్కుమాలిన ఖర్మ ఇంకెవరికైనా వచ్చిందా? అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.
తిరుమల గదుల అద్దె గురించి కూడా ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాన్యులు తీసుకునే రూమ్స్ రెంట్ పెరగలేదు. వీఐపీలకు కేటాయించే గదుల అద్దె మాత్రమే పెరిగింది. దేవుడి గురించి ఈనాడు పాపపు రాతలు రాస్తోంది అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment