సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యం గ్రేటర్ ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. గ్రేటర్‌లో గెలిపిస్తే.. వరద బాధితులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు ఇస్తామంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణికం ఠాగూర్ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో నగర అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలను వివరిస్తూ... పలు రకాల వరాలను ప్రకటించారు. గ్రేటర్‌లో గెలిస్తే.. ఉచితంగా 30 వేల లీటర్ల మంచి నీటిని అందిస్తామన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన హామీలు
- వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
- కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం
- మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులు పాతబస్తీ, శంషాబాద్ వరకు విస్తరింపు
- మెట్రో, ఎంఎంటీఎస్‌లో మహిళలు, వృద్ధులకు ఉచిత ప్రయాణం
- అర్హత కలిగిన అందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు
- 100 యూనిట్ల లోపు గృహాలకు కరెంట్ ఉచితం
- 80గజాలలోపు ఉన్న ఇళ్లకు ట్యాక్స్ రద్దు
- ఉచితంగా 30వేల లీటర్ల మంచి నీరు
- జీహెచ్‌ఎంసీ లైబ్రరీలలో దివ్యాంగులకు ఉద్యోగాలు
Comments
Please login to add a commentAdd a comment