సాక్షి, తాడేపల్లి: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. మొన్నటి వరకు పార్ట్-1 అని, ఇప్పుడు పార్ట్-2 అంటున్నాడని మండిపడ్డారు. రాజకీయం అంటే ఓటీటీ వెబ్ సిరీస్ కాదని చురకలంటించారు. పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ అని విమర్శించారు. పవన్ సినిమాలో చంద్రబాబు విలన్ అని దుయ్యబట్టారు.
‘175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మీకు అభ్యర్థులే లేరు. చంద్రబాబును భుజాన వేసుకొని తిరగడానికి రాజకీయ పార్టీ దేనికి? రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు విలన్. 2019 ఎన్నికల రిజల్ట్ మళ్లీ రిపీట్ అవుతుంది. నేషనల్ మీడియాలో పవన్ భార్యతో విడిపోయారని వార్త వస్తే.. వెంటనే భుజాలు తడుముకొని ఒక ఫోటోల విడుదల చేశారు’ అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
చదవండి: తనకు బలం లేదని పవన్ కల్యాణే ఒప్పుకున్నారు:మిథున్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment