BJP Leader Enugala Peddi Reddy Resign For BJP Party - Sakshi
Sakshi News home page

Huzurabad: బీజేపీకి షాక్‌.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

Jul 26 2021 6:05 PM | Updated on Jul 26 2021 7:23 PM

Huzurabad: Enugala Peddi Reddy Resigns For BJP - Sakshi

సాక్షి, కరీంనగర్: బీజేపీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ చేరికతో గత కొంతకాలంగా పార్టీకి  పెద్దిరెడ్డి దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఈటల రాకను పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదంటూ పేర్కొన్న పెద్దిరెడ్డి ఆ పార్టీలోకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు

కాగా హుజురాబాద్‌లో పెద్దిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడంతో ఆయన నిరాశ చెందారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే, తాను మద్దతు ఇవ్వనని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల పార్టీలో చేరడంపై, తనను ఎవరు సంప్రదించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం కరీంనగర్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement