![Enugula Peddi Reddy To Join TRS On July 30 - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/29/Enugala-Peddi-reddy.jpg.webp?itok=YhdTs1aV)
సాక్షి, కరీంనగర్: ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని గురువారం ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. తనకు రాజకీయ జీవితం ఇచ్చింది హుజురాబాద్ ప్రజలేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
కాగా బీజేపీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ చేరికతో గత కొంతకాలంగా పార్టీకి పెద్దిరెడ్డి దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఈటల రాకను పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదంటూ పేర్కొన్న పెద్దిరెడ్డి ఆ పార్టీలోకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు
Comments
Please login to add a commentAdd a comment