సర్కారుపై బీజేపీ పోరుబాట
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యం
వచ్చే నాలుగేళ్లు నేతలంతా ప్రజల్లోనే ఉండాలి
బీజేపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో నిర్ణయం
రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఎన్నికల హామీలను అమలుచేయకపో వటాన్ని ఎండగడుతూ డిసెంబర్ మొదటివారంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నాలుగేళ్లపాటు (2028లో అసెంబ్లీ ఎన్నికల వరకు) నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానించింది. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల స్టేట్ లెవల్ వర్క్ షాప్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నందున శనివారం రాష్ట్రంలోని ధాన్యం కోనుగో లు కేంద్రాలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సందర్శించాలని నిర్ణయించారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసించాలని ప్రతి పక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లోని ఇళ్లల్లో బీజేపీ నేతలు ‘మూసీ నిద్ర’ చేసి అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు.
11 నెలల్లోనే సర్కార్‌పై వ్యతిరేకత: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టుగా తయారైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 11 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత వచ్చిందని తెలిపారు. గతంలో తెలంగాణను పట్టి పీడించిన బీఆర్‌ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూము లు తాకట్టు పెట్టి అప్పుల కోసం అన్వేషణ సాగి స్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు బీజేపీనే సరైన రాజకీయ ప్రత్యామ్నాయమని తేలిపోయిందని అన్నారు.
పార్టీని సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూనే, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలతో ప్రజలకు అండగా నిలవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రజల పక్షాన నిలిచి పోరాడు దామని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం ఎన్ని వేల కోట్లయినా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగాఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దళారులు, మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు.
బీజేపీని ప్రజలే కోరుతున్నారు: డా.కే లక్ష్మణ్
తెలంగాణలో అతి తక్కువ సమయంలో 30 లక్షల మంది బీజేపీ సభ్యులుగా చేరారని, దీన్నిబట్టే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అర్ధమవుతోందని ఆ పార్టీ నేత డా.కె.లక్ష్మణ్ అన్నారు. ఈ వర్క్‌షాపులో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హరీష్‌బాబు, రామారావు పటేల్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ యెండల లక్ష్మీనారాయణ, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఎం.ధర్మారావు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకోం
‘మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. శుద్ధ నీళ్లు ఇవ్వాల్సిందే.. కృష్ణా, గోదావరి నుండి నీటిని తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. అయితే ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోం’ అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ వర్క్‌షాప్ అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించా రు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, స్థా నిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఖతం చేస్తామని ప్రకటించారు. త్వరలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment