మరీ ఇంత ఘోరమా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా! | Kommineni Comment On AP Government Harassment YSRCP Social Media Activists | Sakshi
Sakshi News home page

మరీ ఇంత ఘోరమా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా!

Published Fri, Nov 8 2024 11:42 AM | Last Updated on Fri, Nov 8 2024 8:10 PM

Kommineni Comment On AP Government Harassment YSRCP Social Media Activists

ప్రతిపక్ష నేతగా  ఉన్నప్పుడు  సోషల్  మీడియా గురించి  చంద్రబాబు నాయుడు చాలా సుభాషితాలు చెప్పారు.   అదే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా ఆ నీతి వచనాలకు  భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేమీ కొత్త సంగతి కాకపోయినా, చంద్రబాబు  స్టైల్  అదే అయినా, ఎప్పటికప్పుడు వాటిని ప్రస్తావించక తప్పడం లేదు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు కొందరు  నీచంగా పోస్టింగ్‌లు పెట్టేవారు . కొంతమంది మరీ దారుణంగా ప్రవర్తించేవారు. చట్టం ప్రకారం అలాంటి వారికి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు పిలిచినా, చంద్రబాబు కాని, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా కాని నానా యాగీ చేసేవి. చాలా ఘోరం జరిగిపోయినట్లు , భావ ప్రకటన స్వేచ్చకు విఘాతం కలిగినట్లు ఆరోపించేవి. సంబంధిత వార్తలను వారి పత్రికలలోమొదటి పేజీలో ప్రచురించి ఏపీలో ఏదో ప్రమాదకరంగా మారినట్లు  మభ్యపెట్టేది.

చంద్రబాబుకాని, ఆయన కుమారుడు లోకేష్ కాని  జగన్ ప్రభుత్వంపై పూర్తి అసత్య పోస్టింగ్ లు పెట్టేవారికి విపరీతమైన  ప్రోత్సాహం ఇచ్చేవారని టీడీపీవారే చెబుతుంటారు. కొన్ని వందల మందిని ఇందుకు నియమించుకున్నారని అంటారు. అలాగే  ఎవరిపైన అయినా కేసులు వస్తే ప్రభుత్వంపైన, పోలీసులపైన తీవ్రమైన విమర్శలు కురిపించేవారు. లోకేష్ అయితే ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి అంత పెద్ద పదవి అంటూ ప్రచారం చేసేవారు.  అదే టైమ్ లో పోలీసు అధికారులను చంద్రబాబు, లోకేష్ లు బెదిరించేవారు.ఒకసారి సోషల్ మీడియా గురించి ప్రెస్ కాన్ఫరెన్స్   పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సుప్రింకోర్టు  గైడ్‌ లైన్స్ ను  వివరించారు.  41 ఎ సెక్షన్ కింద నోటీసు ఇచ్చే సోషల్ మీడియా కార్యకర్తలపై విచారణ జరపాలని, ఎప్పుడు పడితే వారి ఇళ్లకు వెళ్లడాన ప్రతిపక్ష నేతగా  ఉన్నప్పుడు  సోషల్ మీడియా గురించి  చంద్రబాబు నాయుడు చాలా సుభాషితాలు చెప్పారు. 

అదే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా ఆ నీతి వచనాలకు  భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇదేమీ కొత్త సంగతి కాకపోయినా, చంద్రబాబు  స్టైల్  అదే అయినా, ఎప్పటికప్పుడు వాటిని ప్రస్తావించక తప్పడం లేదు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు కొందరు  నీచంగా పోస్టింగ్‌లు పెట్టేవారు . కొంతమంది మరీ దారుణంగా ప్రవర్తించేవారు. చట్టం ప్రకారం అలాంటి వారికి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు పిలిచినా, చంద్రబాబు కాని, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా కాని నానా యాగీ చేసేవి. చాలా ఘోరం జరిగిపోయినట్లు ,భావ ప్రకటన స్వేచ్చకు విఘాతం కలిగినట్లు ఆరోపించేవి. సంబంధిత వార్తలను వారి పత్రికలలోమొదటి పేజీలో ప్రచురించి ఏపీలో ఏదో ప్రమాదకరంగా మారినట్లు మభ్యపెట్టేది. చంద్రబాబుకాని, ఆయన కుమారుడు లోకేష్ కాని  జగన్ ప్రభుత్వంపై పూర్తి అసత్య పోస్టింగ్ లు పెట్టేవారికి విపరీతమైన  ప్రోత్సాహం ఇచ్చేవారని టీడీపీ వారే చెబుతుంటారు.

కొన్ని వందల మందిని ఇందుకు నియమించుకున్నారని అంటారు. అలాగే  ఎవరిపైన అయినా కేసులు వస్తే ప్రభుత్వంపైన, పోలీసులపైన తీవ్రమైన విమర్శలు కురిపించేవారు. లోకేష్ అయితే ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి అంత పెద్ద పదవి అంటూ ప్రచారం చేసేవారు.  అదే టైమ్ లో పోలీసు అధికారులను చంద్రబాబు, లోకేష్ లు బెదిరించేవారు.ఒకసారి సోషల్ మీడియా గురించి ప్రెస్ కాన్ఫరెన్స్   పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సుప్రింకోర్టు  గైడ్‌ లైన్స్ ను  వివరించారు.  41 ఎ సెక్షన్ కింద నోటీసు ఇచ్చే సోషల్ మీడియా కార్యకర్తలపై విచారణ జరపాలని, ఎప్పుడు పడితే వారి ఇళ్లకు వెళ్లడానికి లేదని అన్నారు. వాస్తవమే. ఎప్పుడైనా నిర్దిష్ట నిబంధనలు పాటించే పోలీసులు ప్రవర్తించాలి.

ఆ రోజులలో ఎవరైనా మరీ కొరుకుడు పడకుండా, ఎన్నిసార్లు  అభ్యంతరకర పోస్టింగ్ పెట్టవద్దని చెప్పినా వినని వారి పట్ల పోలీసులు అలా వ్యవహరించారేమో తెలియదు. ఇక టీడీపీ లీగల్ టీమ్ ఎంత యాక్టివ్ గా ఉండేదంటే ఎంత ఘోరమైన పోస్టింగ్ పెట్టినవారినైనా వెంటనే బయటకు వచ్చేలా చూడడానికి గట్టిగా యత్నించేది. చిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్నప్పటికి  ఆ రోజుల్లో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా వారే ఎక్కువగా ఇబ్బందులు పడవలసి వచ్చింది. చంద్రబాబు వ్యవస్థల మేనేజ్ మెంట్ ఆ స్థాయిలో ఉంటుందని చెబుతుంటారు. ఈవిఎమ్ ల మహిమో, లేక ప్రజలు ఓట్లు వేశారో కాని, చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అప్పటి సుద్దులు అన్నీ ఒక్కసారిగా హుష్ కాకి అయ్యాయి.

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు  పెట్టేవారిని భయపెట్టడానికి అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు టీడీపీవారైనా, జనసేనవారైనా, వైఎస్సార్‌సీపీ వారైనా అసభ్య పోస్టింగ్ లు పెడితే కచ్చితంగా చర్య తీసుకోవచ్చు. కాని ఆ ముసుగులో సోషల్ మీడియాలో  కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని, వ్యంగ్య కామెంట్లు పెట్టేవారిని అణచివేయాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. ఉదాహరణకు ఇంటూరి రవికిరణ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తుంటారు కాని, అసభ్య పోస్టింగ్ లు పెట్టరు. కాని ఆయన చురకలను తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను  ప్రయోగించి వరసగా కేసులు పెడుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు, మూడు రోజులలోనే వందమందికి పైగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారంటే ఈ ప్రభుత్వం ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.

ఎక్కడో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని విజయవాడ  తీసుకువచ్చి ఆయనతో ఫిర్యాదు చేయించి ముగ్గురు సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు.  చంద్రబాబుకు    ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్చ అన్ని గుర్తుకు వస్తాయి. అప్పట్లో చంద్రబాబు మొదలు అనేక మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు జగన్‌ను దూషించేవారు. వైఎస్సార్‌సీపీ అసమ్మతి ఎంపీ ఒకరు  రోజూ టీవీ చానళ్లలో కూర్చుని కులాల మధ్య ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే, ఆయనను పోలీసులు అరెస్ట్  చేస్తే టీడీపీవారు ఎంతలా గొడవ చేశారో అంందరూ చూశారు.  ఇప్పుడు  అదే తాము అధికారంలోకి రాగానే అన్ని నిబంధనలను  గాలికి వదలివేసి వైఎస్సార్‌సీపీ వారిపై అరాచకంగా కేసులు  పెడుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి వారి ఇళ్లకు  వెళ్లి బలవంతంగా పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారు.

ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ కు తిప్పుతున్నారు. ఎప్పుడో ఐదారేళ్ల క్రితం పోస్టులు పెట్టారంటూ కొందరికి పోలీసులు ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. వెంకటేష్ యాదవ్, రమణారెడ్డి అనే కార్యకర్తలను ఇలాగే వేధిస్తున్నారట. కొంతమంది కార్యకర్తలపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విజయసాయిరెడ్డి, పొన్నవోలు సుధాకరరెడ్డి, జూపూడి ప్రభాకరరావు తదితరులు చెబుతున్నారు. తమ కుటుంబంపైన, కుమార్తెపైన టీడీపీవారు అసభ్యకర పోస్టింగ్‌లు  పెడుతున్నా పోలీసులు చర్య తీసుకోవడం లేదని మాజీ మంత్రి రోజా వాపోయారు. 

కొద్ది రోజుల క్రితం వైఎస్ విజయమ్మ కు సంబంధించి టీడీపీ అధికారిక వెబ్ సైట్ లో ఒక తప్పుడు  పోస్టింగ్ పెడితే,దానిని ఖండిస్తూ ఆమె స్వయంగా వీడియా విడుదల చేయవలసి వచ్చింది. పలువురు కార్యకర్తలు  ఎక్కడ ఉన్నారో తెలియక వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు  అమెరికాలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ చాప్టర్ 3 ఆరంభిస్తున్నామని చెప్పిన తర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. నిజానికి రెడ్ బుక్ అంటూ ప్రచారం చేయడమే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. కక్షపూరిత రాజకీయాలు చేస్తామని బహిరంగంగా బరితెగించి చెబుతున్నట్లు అన్నమాట.ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

పైగా ఒక బాలిక హత్య కేసులో చర్య తీసుకోవడానికి పోలీసులు వెనుకాడుతున్నారని, కులం అడ్డం వస్తోందని చెబుతున్నారని ఆయన వెల్లడించారు. ఇది ప్రభుత్వపరువు తీసినట్లా కాదా? ఆయన  చెప్పింది నిజమే అయితే సంబంధిత పోలీసు అధికారిపై చర్య తీసుకోవాలి కదా! అదేమీ లేకుండా వైఎస్సార్‌సీపీ పోలీసులు అని, టీడీపీ పోలీసులు అని ఒక పిచ్చి విభజన తీసుకు వచ్చి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు మాట్లాడుతుంటే ఏపీ ఎటువైపు వెళుతోందో అన్న భయం వేస్తోంది. పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడవచ్చుకాని, ఆ మాటలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తే తప్పు అన్నట్లుగా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. కడప జిల్లాలో పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరిస్తే వారికి వైఎస్సార్‌సీపీ ముద్ర వేయడం, జిల్లా ఎస్పిని బదలీ చేయడం, ఒక సిఐ ని సస్పెండ్ చేయడం శోచనీయం. చిత్రమేమిటంటే ఆ అదికారులను అక్కడ నియమించింది చంద్రబాబే. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పవలసిన చంద్రబాబు తెలివిగా దానినంతా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాపైకి నెట్టేసి, పోలీసు అధికారులపై ఆరోపణలు చేసేసి తప్పించుకున్నారు.  

దానినే ఈనాడు,  ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తప్ప, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల ప్రభుత్వపరువు పోయిందన్నదానిపై క్యాబినెట్ లో చర్చించలేకపోయారని మాత్రం రాయలేదు.నిజానికి ప్రభుత్వం పై జనం బూతులు తిడుతున్నారని పవన్ కళ్యాణ్ చెబితే, దానిని చంద్రబాబు ఖండించలేకపోయారు. సూపర్ సిక్స్ హామీలు అంటూ జనాన్ని మభ్య పెట్టిన విషయాలపై సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తుంటే మాత్రం వారిపై విరుచుకుపడుతున్నారు. విజయవాడ వరదల సమయంలో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు ఇరవైమూడు కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపడం తీవ్ర విమర్శలకు గురైంది.ఆ విషయాన్ని తొలుత బయటపెట్టింది సిపిఎం నేత బాబూరావు.దాని వల్ల పరువు పోయిందని ప్రభుత్వం భావిస్తే ఆయనకు నోటీసు ఇవ్వాలి కదా! అలాకాకుండా ఆయన వీడియోలను పోస్టు చేసినవారికి నోటీసులు ఇచ్చారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిది అవుతు శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఇలా ఉంది ఏపీలో పోలీసుల తీరు.  

ఈ నేపధ్యంలోనే వైఎస్సార్‌సీపీ అలెర్ట్ అయింది. ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియావారిపై అక్రమ కేసులు పెడుతున్నవారికి అండగా లాయర్లను నియమించుకుంది. పోలీసులు అక్రమ కేసులు  పెట్టినా,వారిపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించినా, ప్రైవేటు కేసులు వేయడానికి సిద్దం అవుతున్నారు. పోలీసు అధికారులు కూటమి నేతల ఒత్తిడి భరించలేకపోతున్నారు.  డిజిపి ఇలాంటివాటిని నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన హెచ్చరిక గమనించదగిందే. జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు  నాయుడు తన కుమారుడు లోకేష్ కలిసి చేస్తున్న ఈ  పాపాలు ,ఘోరాలు వారికి శాపాలుగా మారతాయని, నాగుపాములా వారిని వెంటాడతాయని హెచ్చరించారు.  

అధికారం శాశ్వతం కాదని, ఇప్పుడు టీడీపీ వారు చేస్తున్న వేధింపులకు పదిరెట్లు  అనుభవించవలసి వస్తుందని స్పష్టం చేశారు.  ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. ఈ పెద్ద వయసులో చంద్రబాబు ఇంతగా అప్రతిష్ట కావడం ఆయనకు  ఏ విధంగా ఉపయోగమో అర్దం కాదు. అలాగే కాబోయే సీఎం అని ప్రచారం అవుతున్న లోకేష్ ఇప్పుడే ఇలా ఉంటే నిజంగానే ఆ పదవి వస్తే  పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అన్న  భయం ప్రజలకు కలగదా!ఇప్పటికైనా వీరిద్దరు తమ పంథా మార్చుకుని ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మంచిది. లేని పక్షంలో కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నట్లు ప్రజలలోనే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుందని వారు ఎంత త్వరగా గమనిస్తే వారికే అంత మంచిది.


::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement