![KTR Serious Comments On Revanth And Batti Vikramarka](/styles/webp/s3/article_images/2024/08/1/ktr3.jpg.webp?itok=O5BKX4WT)
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ప్రవర్తనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంల ప్రవర్తన అత్యంత అవమానకరమైంది. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి వీరు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలి. వారిపట్ల గౌరవంగా ఉండాలి. ఈ రకమైన ప్రవర్తన సరికాదు. కాంగ్రెస్ నేతల నుండి ఈ రకమైన వ్యాఖ్యలు కేవలం మన నాయకులపైనే కాకుండా మహిళలందరి పట్ల వారి ధిక్కారాన్ని, అగౌరవాన్ని తెలియజేస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Highly shameful and disgraceful behaviour of CM and Deputy CM in the state assembly
We demand their unconditional apology to both Smt @BrsSabithaIndra Garu and Smt @sunitavakiti Garu. Both of them are senior legislators and former ministers, known for their dignified behaviour… https://t.co/HXuCP9f9Bv— KTR (@KTRBRS) August 1, 2024
![](/sites/default/files/inline-images/16_5.png)
Comments
Please login to add a commentAdd a comment