చిల్లర సినిమా తీస్తూ రెచ్చగొట్టాలని యత్నం: కేటీఆర్‌ | KTR Slams Kishan Reddy And BJP Government In Centre | Sakshi
Sakshi News home page

చిల్లర సినిమా తీస్తూ రెచ్చగొట్టాలని యత్నం: బీజేపీపై కేటీఆర్‌ ధ్వజం

Published Tue, Sep 19 2023 6:58 PM | Last Updated on Tue, Sep 19 2023 7:48 PM

KTR Slams Kishan Reddy And BJP Government In Centre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కులం, మతం పేరుతో దేశాన్ని విభజించాలని కేంద్రలోని బీజేపీ చూస్తోందని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు సెప్టెంబర్‌ 17 గాయాలు మానుతుంటే చిల్లర సినిమా తీస్తున్నారని, మానిన గాయాలను మళ్లీ రెచ్చగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మతాల మంటల్లో చిచ్చుపెట్టి చలి కాగాలని బీజేపీ చూస్తోందని.. ఏదో రకంగా ప్రజల అటెన్షన్‌, డైవర్షన్‌ చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కొత్తగూడెం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత తొమ్మిదేళ్లలో కేంద్రం ఏనాడూ తెలంగాణను ఆదుకోలేదని మంత్రి ధ్వజమెత్తారు.  భద్రాచలం అయిదు మండలాలు ఏపీలో కలిపింది బీజేపేనని గుర్తు చేశారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం చట్టంలో పెట్టీ ఇప్పటికీ ఇవ్వలేదని కేటీఆర్‌ విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సిగ్గుంటే ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని హితవు పలికారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. రూ.200 పెన్షన్‌ ఇవ్వలేనోళ్లు రూ. 4వేల పెన్షన్‌ ఎలా ఇస్తారని నిలదీశారు.
చదవండి: తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు: గుత్తా సుఖేందర్‌ ఫైర్‌

‘కేంద్రం ఇచ్చే ఉద్యోగాలు ఇవ్వమని అడుగు. ఇక్కడ బీజేపీ నాయకత్వం దిక్కుమాలిన దందాలు, ధర్నాలు చేస్తోంది. గ్యాస్ ధరలు పెంచిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేయాలి. రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. మణిపూర్ మండుతున్న పట్టించుకోవటం లేదు. ఎన్నికలు వస్తున్నాయి అని రజాకార్ సినిమా తీసి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తోంది. దిగజారి పోయిన ప్రధాని ఓ వైపు, మరోవైపు కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అడుక్కుంటోంది. అధికారం దూరం అవుతుందనే ఫ్రస్టేషన్‌లో కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇస్తోంది.

కాంగ్రెస్ అధికారిక రాష్ట్రంలో ఎక్కడైనా 4వేల పెన్షన్‌లు ఇస్తున్నారా?. కాంగ్రెస్‌లో ఎవడు ముఖ్యమంత్రో తెలియదు. వీళ్ళు ఆరు గ్యారంటీలంటూ మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే సంక్షేమం వెనక్కి పోతుంది. రాజకీయ అస్థిరత తెలంగాణలో ఖాయం. తెలివి లేని, ఆలోచన లేని, వ్యూహం లేని వాళ్ళు, డబ్బు సంచులతో దొరకిన వాళ్ళు ఇలాంటి హామీలు రాసిచ్చారు. కర్ణాటకలో పవర్ హాలిడే, కరెంట్ కోతలు ప్రారంభం అయ్యాయి. అభివృద్దికి పైసలు లేవని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ చెప్పారు’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement