
సాక్షి, అమరావతి: చట్టానికి ఎవరూ అతీతులు కారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అయినా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవన్నారు.
చదవండి: సినీనటుడు ఆలీ సడన్ సర్‌ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా..
‘‘మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ మా గురించి మాట్లాడతారా? పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు. మీ నిర్వాకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. లోకేష్.. పార్టీకి పట్టిన శనిగా చెప్పుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్న నాయకుడు. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు.