పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేతో వెళ్ళి దొంగ ఓట్లపై ఫిర్యాదా?: మంత్రి అంబటి | Minister Ambati Rambabu Slams Chandrababu For Fake Vote Complaint | Sakshi
Sakshi News home page

పార్టీ ఫిరాయింపు దొంగతో కలిసి వెళ్ళి దొంగ ఓట్లపై ఫిర్యాదా?: మంత్రి అంబటి

Published Tue, Jan 9 2024 7:50 PM | Last Updated on Fri, Feb 2 2024 4:31 PM

Minister Ambati Rambabu Slams Chandrababu For Fake Vote Complaint - Sakshi

సాక్షి, గుంటూరు: దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఒక్క చంద్రబాబేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బాబుకు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదని, క్యాష్‌, కుట్రలు, కుత్రంత్రాలపై మాత్రమే నమ్మకం ఉండేదని మండిపడ్డారు. ఇలాంటివి చేసే ఎదిగాడు తప్ప ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు కాదని దుయ్యబట్టారు.

పార్టీ ఫిరాయింపు దొంగతో కలిసి వెళ్ళి(ఉండవల్లి శ్రీదేవిని ఉద్ధేశిస్తూ) దొంగ ఓట్లపై ఫిర్యాదా అంటూ బాబుపై మండిపడ్డారు. తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి దొంగ ఓట్లు కొంటూ పట్టుబడింది బాబే కదా అంటూ ఎద్దేవా చేశారు. శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్షనాయకుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి పలు అంశాలను విన్నవించి.. బయటకు వచ్చి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు చంద్రబాబు
ఇంకా మంత్రి అంబటి మాట్లాడుతూ.. ‘గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. మనవద్ద జరిగేలా కాస్ట్లీ ఎన్నికలు ఎక్కడా ఉండవు. దీనికి కారణం చంద్రబాబే. ఎన్టీఆర్‌ను దించిన తర్వాత తాను గెలవడం కోసం ఓటర్లను కొనేందుకు విపరీతంగా ఖర్చు పెట్టింది చంద్రబాబే. ఇలాంటి దుర్మార్గుడు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు చంద్రబాబు. అసలు ప్రజాస్వామ్యంపై మాట్లాడటానికి చంద్రబాబుకి బుద్దుందా? తెలంగాణ నుంచి నువ్వు ఎందుకు పారిపోయి వచ్చావో మర్చిపోయావా బాబూ..? ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొనడానికి ప్రయత్నం చేసి డైరెక్ట్‌గా పట్టుబడటం వల్లే కదా నువ్వు ఏపీ పారిపోయి వచ్చావ్‌..? 

కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు మన అంధ్రప్రదేశ్‌కు వచ్చారు. రాజకీయ పార్టీలను కలిసి వారి ఫిర్యాదులను విని ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగేలా రాజకీయ పక్షాలతో సమావేశం అయ్యారు. దీనిలో చిత్రంగా శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్షనాయకుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి కొన్ని అంశాలను విన్నవించి.. బయటకు వచ్చి వైఎస్సార్సీపీపై విమర్శలు చేశారు. మేము అప్రజాస్వా మేము అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రొత్సహిస్తున్నామని మాట్లాడారు.

వాళ్లను కూడా తీసుకెళ్తే బాబు బండారం బయటపడేది
ఆయనతో పాటు వైఎస్సార్సీపీని మోసం చేసి, డబ్బు తీసుకుని టీడీపీకి ఓటు వేసిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని తీసుకెళ్లారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయడానికి మరో దొంగ ఓటరును వెంటబెట్టుకుని వెళ్లడం విడ్డూరం. వైఎస్సార్సీపీలో ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి.. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అమ్ముడుపోయి.. చంద్రబాబు చెప్పినట్లుగా ఓటు వేసిన శ్రీదేవిని వెంటబెట్టుకుని వెళ్లి మాపై ఫిర్యాదు చేస్తున్నాడు. ఈయన ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నట్లు నటిస్తున్నాడు. ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,మేకపాటి చంద్రశేఖరరెడ్డిలను కూడా వెంటబెట్టుకుని వెళితే ఆయన బండారం ఇంకా బయటపడేది. 

దొంగ ఓట్లపై గెలుస్తున్న దొంగ చంద్రబాబు
గెలిచిన ప్రతిసారీ కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే బాబు గెలిచాడు. నేడు ఆ దొంగ ఓట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యయుతంగా జరిగితే చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయం. దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబునాయుడు ఓడిపోవడం గ్యారెంటీ. దొంగ ఓట్లతోనే రాజకీయం చేసిన దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు. మాకెందుకు దొంగ ఓట్లు..? ఐదేళ్లు చిత్తశుద్ధిగా పరిపాలన చేసిన ప్రభుత్వం మాది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్‌ గారిని అన్ని వర్గాల వారు గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే పరిస్థితి ఉంది. మాకు అసలు దొంగ ఓట్లతో పనేంటి? 175కి 175 స్థానాలూ గెలిచే పరిస్థితి మాకుంది. మేం మానిప్యులేషన్‌ చేయాల్సిన అవసరం లేదు..ఆ లక్షణమే మాకు లేదు. 

గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు చాలా ప్రమాదకరం అన్నాడు. వాటివల్లే మేం ఓడిపోయాం అన్నాడు. 2019 ఎన్నికలప్పుడు ఈవీఎంలలో సైకిల్‌కు ఓటు వేస్తే ఫ్యాన్‌కి పడింది అని చెప్పాడు. ఇవాళ ఆ మాటలు ఏమయ్యాయి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఈవీఎంల గురించి ఫిర్యాదు చేయలేదేం? గత ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి సీఈవోగా ఉన్న దివ్యేది గారిని ముఖ్యమంత్రిగా ఉండి బెదిరించే కార్యక్రమం చేశాడు. ఓటమి భయంతో ఓడిపోతానని తెలిసినప్పుడు చంద్రబాబు ఇలాంటి వేషాలు వేయడం కొత్తేమీ కాదు. 

పవన్‌ కల్యాణ్‌ నీకెందుకు గ్లాసు గుర్తు..సైకిల్‌ గుర్తుపైనే పోటీ చెయ్‌..!
శ్రీదేవిని వెంటబెట్టుకుని వెళ్తే వెళ్లాడు..పవన్‌కల్యాణ్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు. బహుశా గుర్తింపు లేని పార్టీకి అనుమతి లభించదని, చంద్రబాబు చెంచాగా వెళ్లాడేమో..ఎందుకయ్యా..పవన్‌ కల్యాణ్‌ నీకు గ్లాసు గుర్తు..? సైకిల్‌ గుర్తుపైనే పోటీ చేయవచ్చు కదా? నీ పార్టీని విలీనం చేసేయ్‌...కావాలంటే కొంచెం ప్యాకేజీ పెంచండి అని అడిగితే బాగుండేది. దుర్మార్గపు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నిష్ణాతుడు. చెప్పిన మాట చెప్పకుండా మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయనకు తానా తందానా అనే పత్రికలు ఉన్నాయి..వారి రాతలు చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చి కూర్చున్నట్లే ఉంటుంది.

 వైఎస్సార్సీపీ పని అయిపోయింది...తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కూర్చుంది అన్నట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తూనే ఉంటాయి. షర్మిల వస్తే జగన్‌ ఏదో అన్నాడని రాధాకృష్ణ రాతలు రాశాడు. రాధాకృష్ణ బల్లకింద ఉన్నాడా? బాత్రూమ్‌లో ఉన్నాడా?  మీరు ఎన్ని దుష్టపన్నాగాలు పన్నినా తిరిగి రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే ముఖ్యమంత్రి. ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నిలబెట్టుకుని ప్రజల గుండెల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకునే క్రమంలో జగన్‌ పరిపాలన చేశారు.

వైఎస్సార్సీపీ 175+25 టీం రెడీ..  
ఎన్నికల కమిషన్‌ వచ్చింది కదా అని దత్తపుత్రుడు, దత్తతండ్రి ఇద్దరూ వెళ్లి వినతులిస్తే సరిపోదు. అసలు విషయం వదిలేసి కొసరు విషయాలు మాట్లాడి మమ్మల్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు. కలిసి తిరిగితే తిరిగారు. మాకు అభ్యంతరం లేదు. ఇంకా మీరు సీట్లు పంచుకునే కార్యక్రమమే ప్రారంభం కాలేదు. సీఎ జగన్‌ టీం 175+25 టీం రెడీగా ఉంది. త్వరలో టీంను ప్రకటించబోతున్నారు. మేం ఎవర్ని మారిస్తే మీకేంటి బాధ..? సమయాన్ని బట్టి మార్చుకుంటాం..వారితో సర్ధుకుంటాం. ఆయన్ను మార్చారు.. ఈయన్ని మార్చలేదు అంటాడు...నువ్వు చెప్పినట్లు మార్చాలా? 

నీ పార్టీ సంగతి నువ్వు చూసుకో. మొసలి కన్నీరు ఎందుకు.? అంబటి రాయుడు టీ20కి దుబాయ్‌లో ఆడటానికి వెళ్లాడు.. రాజకీయాల్లో ఉండకూడదు కాబట్టి పార్టీకి రాజీనామా చేశాడు. దాన్ని ఈనాడు మొదటి పేజీ వార్త రాసింది. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కేశినేని నాని, ఆయన కుమార్తె, కార్పొరేటర్‌ శ్వేత రాజీనామా చేస్తే ఈనాడులో ఆఖరు పేజీ వార్త. ఇలా ఏదో ఒక విధంగా మానిప్యులేట్‌ చేసి చంద్రబాబును గొప్పగా చూపాలని, జగన్‌ను చిన్నగా చేయాలని మీరు చేసే ప్రయత్నాలు ప్రజలకు అర్ధం అయ్యాయి. 

మీరు కక్కే విషం స్పష్టంగా ప్రజలకు తెలిసిపోతోంది. రాష్ట్ర ప్రజలు మీ తీరును పూర్తిగా అర్ధం చేసుకున్నారు. మీ పత్రిక.. మీ ఇష్టం.. మీరు రాసుకోండి.. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. న్నికలకు వెళ్లబోతున్నాం..అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు వెళుతున్నాం. ఎవరినీ కలుపుకునేది లేదు..సింగిల్‌గానే వెళ్తున్నాం..175+25 మొత్తం కొట్టుకుని తిరిగివస్తాం. మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తాం. మీరెంత మంది కలిసి వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు. ఇక చంద్రబాబు పని అయిపోయింది..ఈ ఎన్నిక తర్వాత చాప సర్ధుకుని హైదరాబాద్‌ స్వగృహానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. 

అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేయకూడదు బాబూ..!:
హైదరాబాద్‌లో ఉంటే ఇక్కడ  ఓటు ఉండకూడదా? అంటున్నాడు. ఎక్కడున్నా ఇక్కడ ఓటు ఉండొచ్చు..సందేహం లేదు. అయితే అక్కడ ఒక ఓటు..ఇక్కడో ఓటు ఉండకూడదు బాబూ.. అయితే హైదరాబాద్‌లో మొన్న ఓటు వేసి మళ్లీ ఇక్కడకు వచ్చి ఓటు వేస్తామంటే ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది..? చంద్రబాబుకు అక్కడా..ఇక్కడా ఓటు కావాలట..అది అప్రజాస్వామికం బాబూ..  ప్రతి ఓటరుకు ఒక ఓటే ఉండాలి..రెండు చోట్ల నమోదు కావాలి. టీడీపీ వాళ్లకు కాస్త పిచ్చెక్కువ..అందుకే నా మీద విమర్శలు చేస్తుంటారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కన్నా లక్ష్మీనారాయణ నా మీద చాలా మాట్లాడుతుంటాడు. ఆయన ఒక పార్టీకి కన్నం వేయడం వేరే పార్టీలో చేరడం అలవాటు.  ప్లీడర్లు వాదించినట్లే కన్నా కూడా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తరఫున కూడా వాదిస్తాడు. ’ అని మండిపడ్డారు అంబటి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement