
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో బీజేపీ అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తోందని, 2 వేల కార్లు, మోటార్ సైకిళ్లు బుక్ చేశారంటూ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ మోటర్ సైకిళ్లు, రేపు మీటర్లకు మోటర్లు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
చదవండి: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
‘‘గెలిచేది రాజగోపాల్ ధనమా?. ప్రజాస్వామ్యమా?. మా దగ్గర తాంత్రిక పూజలు లేవు, ఉన్నది లోక్ తాంత్రిక్ మాత్రమే. బెనారస్ వర్శిటీలో భూత వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు బీజేపీ తెచ్చింది. బండి సంజయ్ భూత వైద్యం కోర్సులో చేరితే బాగుంటుంది’’ అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. వందే భారత్ రైళ్లు బర్రెలు అడ్డొస్తేనే తుక్కుతుక్కు అవుతున్నాయి. బీజేపీ నేతలు వందే భారత్ మాటలు మాట్లాడొద్దు అంటూ మంత్రి మండిపడ్డారు.
మునుగోడు ప్రజలు ఆలోచించాలి. వారి ఆత్మ గౌరవానికి ఇది పరీక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కానీ బీజేపీ చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు భారీగా పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి దేశాన్ని ఆగం చేశారు. దేశ సైనికులను కూడా వదలకుండా అగ్నిపత్ స్కీం తీసుకొచ్చి వారి ఉసురు పోసుకుంటోంది. క్షుద్రపూజలు అంటూ విష ప్రచారాలు చేస్తోంది. కార్లు, బైకులు కాదు విమానాలు కొనిచ్చిన మునుగోడు ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారు’’ అని మంత్రి హరీష్‌రావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment