సాక్షి, అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ మ్యానిఫెస్టో తొలగించిన చరిత్ర టీడీపీదేనని మండిపడ్డారు. చంద్రబాబు మాయమాటలు నమ్మే స్థితిలో జనాలు లేరని, చంద్రబాబును జనం ఎప్పుడో ఇంటికి పంపారని గుర్తుచేశారు. బీసీ మంత్రులను డమ్మీగా చేసిన చరిత్ర చంద్రబాబుదేనని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు,
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రి కొనియాడారు. ఎన్నికలకు ముందే అధ్యయన కమిటీలు ఏర్పాటు చేసి స్టడీ చేశారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో సామాజిక విప్లవం వచ్చిందన్నారు. అన్ని కులాలకు పదవులు దక్కడం దేశంలో ఎక్కడా లేదన్న పెద్దిరెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే ఇదంతా సాధ్యం అయ్యిందన్నారు. బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. బస్సు యాత్ర టీడీపీ మహానాడుకు పోటీ కాదని స్పష్టం చేశారు.. చంద్రబాబు నీచరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
చదవండి: మూడు సార్లు ఓడితే పార్టీ టికెట్ ఇచ్చేది లేదు : నారా లోకేష్
Comments
Please login to add a commentAdd a comment