
సాక్షి, విజయవాడ: ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబూ.. నేను విశ్వాస ఘాతకుడినే.. అదీ నీ ఒక్కడికి మాత్రమే. కానీ నువ్వు.. ఇందిరాగాంధీకి, ఎన్టీఆర్, హరికృష్ణ, దగ్గుపాటి, పెద్దలు మోదీ, అమిత్ షాకు నమ్మకద్రోహివి’’ అంటూ వల్లభనేని వంశీ ట్వీట్ చేశారు. ‘వెన్నుపోట్లకు, నమ్మకద్రోహాలకు, విశ్వాస ఘాతుకాలకు నిఖార్సైన పేటెండ్ దారుడివి..నువ్వే చంద్రబాబు’ అంటూ ట్విట్టర్‌లో వల్లభనేని వంశీ మండిపడ్డారు.
‘‘చంద్రబాబూ.. నేను కేసీఆర్‌కు పొర్లుదండాలు పెడుతున్నానన్నావు.. నిజమే.. మరి నువ్వు? కేసీఆర్ ముందు మోకాలిదండేసి ‘‘మోర’’ ఎత్తి పనిచేస్తున్నావుగా.. ఓటుకు నోటు కేసు తేలేవరకు అంతేగా..’’ అంటూ వంశీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చదవండి: మీ ప్రతీ మాటకు నేనంతే స్థాయిలో సమాధానం చెప్తా: వల్లభనేని వంశీ
Comments
Please login to add a commentAdd a comment